Begin typing your search above and press return to search.
బాబుకు బుర్రలేదు కానీ..వెన్నుపోటులో గొప్పోడు
By: Tupaki Desk | 19 Dec 2017 2:34 PM GMTఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మరోమారు ప్రధాన ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ సెటైర్ వేశారు. అనంతపురం జిల్లా మారాల గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ బాబు తీరును తూర్పారాపట్టారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అనేక క్లిష్టమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అందుకే పాదయాత్ర చేపట్టానని జగన్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలకు భరోసా కల్పించేందుకు, అక్కా చెల్లెమ్మలకు తోడుగా నిలిచేందుకు పాదయాత్రను మొదలుపెట్టానని తెలిపారు. చదువుకున్న పిల్లోడు ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో పిల్లాడు ఉన్నాడని ఆ పిల్లలకు తోడుగా ఉండేందుకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టానని వివరించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకుంటున్న అనుభవం ఏదీ ప్రజల కోసం ఉపయోగపడటం లేదని...వెన్నుపోటులో రాజకీయ అనుభవం మాత్రమే చంద్రబాబుకు ఉందని జగన్ ఎద్దేవా చేశారు. ``ఎన్నికల సమయంలో రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించగా..తాను జగన్ కంటే సీనియర్ అని చెప్పి రూ. 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ ఆ నిధి ఎక్కడుందో అర్థం కావడం లేదు. రైతులు పండించిన పంటలకు రేట్లు ఉండటం లేదు. ఆ ధాన్యం షాపులకు వచ్చిన తరువాత రేట్లు పెరుగుతున్నాయి. చంద్రబాబు మన వద్ద కొన్న సరుకులను ప్యాకెట్లలో పెట్టి హెరిటేజ్ షాపులో పెట్టి అమ్ముకుంటున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు వ్యవసాయంలో ఉన్నాయి` అని జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు బుర్ర లేదనడానికి అనంతపురం ఉదాహరణ అని జగన్ మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల హంద్రీనీవా ప్రాజెక్టు అక్షరాల రూ. 6 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపు 80 శాతం పనులు పూర్తి చేశారని కానీ ఆ తర్వాతి పనులను కొనసాగించడంలో వైపల్యం చెందారని అన్నారు. ` ఆ పనులకు కొనసాగింపుగా చంద్రబాబు చేయాల్సిందేంటంటే..పిల్ల కాల్వలు తవ్వాలి. ఈయన పిల్లకాల్వలు తవ్వకపోవడం వల్ల రైతులు కరువుతో అల్లాడుతున్నారు. పీఏబీఆర్ కాల్వ కింద కూడా పిల్ల కాల్వలు తవ్వడం లేదు. రాయలసీమ జిల్లాల్లో తాగడానికి నీరు లేకపోయినా చంద్రబాబుకు మనసు రావడం లేదు. శ్రీశైలం నిండా నీరు ఉన్నా నీరు ఇవ్వాలన్న ఆలోచన ఈ మనిషికి రావడం లేదు. చంద్రబాబు పుణ్యానా నాలుగు లక్షల మంది బెంగుళూరుకు వెళ్లి సెక్యూరిటీ గార్డులుగాను, ఇతరత్రా పనులు చేస్తున్నారు. నీళ్లు ఇస్తామని డబ్బాలు కొట్టుకుంటున్న చంద్రబాబును ఇవాళ అడుగుతున్నాను. ఇదే జి ల్లాలో 63 మండలాలను ఎందుకు కరువు ప్రాంతాలుగా ప్రకటించావని అడుగుతున్నాను. ` అంటూ ప్రశ్నించారు.
తాము వచ్చిన తర్వాత రైతుల కోసం పలు కీలక పథకాలు తీసుకు రానున్నట్లు వైఎస్ జగన్ వెల్లడించారు. రైతులకు కరువు, అకాల వర్షం వచ్చిన సమయంలో వారిని ఆదుకునేందుకు ప్రకృతి వైఫరీత్యాల నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు రూ.2 వేల కోట్లు, కేంద్రం నిధులు రూ.2 వేల కోట్లు కలిపి మొత్తం రూ. 4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేసి రైతులకు తోడుగా ఉంటుందని జగన్ వెల్లడించారు. `టీడీపీ హయాంలో ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా ముందుకు సాగడం లేదు. పోలవరం నుంచి హంద్రీనీవా వరకు ఏ ప్రాజెక్టు పనులు సాగడం లేదు. మనం అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తాం. చంద్రబాబు పుణ్యానా రైతులు బ్యాంకు గడప తొక్కడం లేదు. వ్యాపారుల వద్ద వడ్డీలకు అప్పు చేయాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు వైఎస్ ఆర్ భరోసా కార్యక్రమం ప్రకటించాం. జూన్‌లో రైతులు వ్యవసాయం మొదలుపెడతారు కాబట్టి రైతులకు తోడుగా ఉండేందుకు ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తాం. ఇది వరకు 5 ఎకరాల లోపు రైతులకే ఇవ్వాలని అనుకున్నాం. అయితే పాదయాత్రలో రైతుల కష్టాలు తె లుసుకున్నాక అందరికి రూ.12,500 ఇవ్వాలని భావించాం. ఈ డబ్బు రైతులకు పెట్టుబడులకు ఉపయోగకరంగా ఉంటుంది. పెట్టుబడి తగ్గించేందుకు రైతు భరోసా కింద ప్రతి ఏడాది రూ.12,500 ఇస్తాం` అని జగన్ ప్రకటించారు.