Begin typing your search above and press return to search.

సీమపై బాబు కెంత నిర్లక్ష్యమో జగన్ చెప్పారు

By:  Tupaki Desk   |   6 Jan 2017 5:19 AM GMT
సీమపై బాబు కెంత నిర్లక్ష్యమో జగన్ చెప్పారు
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విపక్ష నేత జగన్ మరోసారి ఫైర్ అయ్యారు. సీమకే చెందిన చంద్రబాబుకు.. తన ప్రాంతంపై ఆయనకెంత నిర్లక్ష్యమన్న విషయంపై జగన్ చేస్తున్న వాదన వింటే.. నిజమే కదా? అనిపించక మానదు. తాజాగా కర్నూలు జిల్లాలో ఆయన నిర్వహించిన రైతు భరోసా యాత్ర సందర్భంగా సీమ పట్ల బాబు కున్న నిర్లక్ష్యంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జగన్ సూటి ప్రశ్నల్ని విన్నప్పుడు.. బాబు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించక మానదు. మరి.. ముఖ్యంగా శ్రీశైలం డ్యాం విషయంలో బాబు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దివంగత మహానేత వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు ఇప్పుడు చంద్రబాబు వచ్చి గేట్లు ఎత్తటమే కాదు.. అదంతా తన క్రెడిట్ అన్నట్లుగా చెప్పుకుంటున్నారని.. వాస్తవాల్ని పక్కదారి పట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని జగన్ మండిపడుతున్నారు. పట్టిసీమకు జగన్ వ్యతిరేకమని చెప్పటం ద్వారా.. సీమ పట్ల తనకున్న కమిట్ మెంట్ ను చంద్రబాబు చెబుతున్న వేళ.. ఆ విషయంలో బాబు కంటే తనకే ఎక్కువ కమిట్ మెంట్ అన్న విషయాన్ని చెప్పేలా జగన్ మాటలు ఉన్నాయని చెప్పొచ్చు.

పట్టిసీమ పేరు ఎత్తకుండానే.. సీమలోని మిగిలిన ప్రాజెక్టుల పట్ల చంద్రబాబు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపేలా జగన్ మాట్లాడటం గమనార్హం. సీమలోని ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చే విషయంలో బాబు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ఎత్తి చూపేలా కొన్ని సూటి ప్రశ్నల్ని సంధించారు. అలాంటి వాటిలో కొన్నింటిని చూస్తే..

= సీమకు నీళ్లు ఇచ్చే ప్రధాన కాలువైన పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయటానికి శ్రీశైలం డ్యాంలో 844 అడుగుల నీరు ఉంటే సరిపోతుంది. ఈ ఒక్క కాలువే 44 క్యూసెక్యుల నీటిని డిశ్చార్జ్ చేస్తుంది. ఈ రోజుకి డ్యాంలో 862 అడుగుల నీరు ఉంది.ఆగస్టు16 నుంచి ఈ రోజు(జనవరి 5 వరకు) వరకూ 844 అడుగుల కంటే ఎక్కువ నీరే ఉంది. అయినా.. రాయలసీమ ప్రాజెక్టులకు నీరు ఇవ్వలేదు.

= పోతిరెడ్డిపాడుతో పాటు గండికోట.. దిగువన ఉన్నరిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వలేదు. సీమ ప్రాజెక్టులకు బాబు ఎందుకునీరు ఇవ్వనట్లు..?

= 2009లో వరదలు వచ్చినప్పుడు విపరీతమైన నీటిని నిల్వ చేసినప్పుడు శ్రీశైలం ప్లంజ్ పూల్ లో దాదాపు 100 అడుగుల మేర గొయ్యి ఏర్పడింది.దానికి మరమ్మతులు చేయటానికి ఇప్పటికి మనసు రాలేదెందుకు?

=ఆ గొయ్యికి కానీ రిపేర్ చేయకుంటే అంతిమంగా శ్రీశైలం డ్యాం మీద ప్రభావం పడుతుంది.దాని కారణంగా డ్యాంకు ప్రమాదమని తెలిసినా.. ఇప్పటివరకూ మరమ్మతులు షురూ కాలేదు. మూడేళ్ల క్రితమే ఇంజనీర్లు పంపిన ప్రతిపాదనల్ని చంద్రబాబు ఇప్పటివరకూ ఎందుకు పట్టించుకోలేదు?

= ఎప్పుడో పూర్తి అయిన పులిచింత ప్రాజెక్టులో 44 టీఎంసీల నీటిని ఉంచుకునే వీలున్నా.. ఆర్ అండ్ఆర్ కు డబ్బులు ఇవ్వకపోవటం వల్ల నీళ్లు నింపుకోలేని పరిస్థితి. ఈ కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి 55 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదులుకోవాల్సి వస్తోంది.

= కర్నూలు – కడప కేసీ కెనాల్ సప్లిమెంట్ చేసే మచ్చుమర్రి ప్రాజెక్టును స్టార్ట్ చేసిందే వైఎస్. ఆయన హయాంలోనే 90శాతం పనులు పూర్తి అయ్యాయి. వైఎస్ తర్వాత వచ్చిన వారు ఐదుశాతం పనులు చేస్తే.. మిగిలిన ఐదు శాతం పనుల్ని పూర్తి చేసిన చంద్రబాబు.. ఈ ప్రాజెక్టు ఘనత మొత్తం తనదేనని చెప్పుకుంటున్నారు. వైఎస్ కు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వటం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/