Begin typing your search above and press return to search.
బాబు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్యకంత్రీ అట
By: Tupaki Desk | 6 Feb 2017 9:32 AM GMTఏపీ సీఎం చంద్రబాబు పాలనపై విపక్ష నేత జగన్ విరుచుకుపడ్డారు అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన చంద్రబాబును తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఎక్కడికక్కడ ఉదాహరణలు, వివరణలు, ఉపమానాలతో జగన్ మాట్లాడుతుంటే మాటమాటకూ ప్రజలు చప్పట్లు చరుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు చేతకానితననాన్ని జగన్ ఏకిపడేశారు. తొమ్మిదేళ్లు సీఎం పనిచేసిన చంద్రబాబు ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారని విమర్శించారు.
వైఎస్ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని.. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన 10శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోతోందన్నారు. చంద్రబాబునాయుడు అసలు ముఖ్యమంత్రి కాదు.. ముఖ్య కంత్రీ అని జగన్ అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందన్నది వివరించారు. ఒకప్పుడు రాజస్థాన్ లోని జైసల్మీర్ లో అతి తక్కువ వర్షపాతం ఉండేదని, ఇప్పుడు అనంతపురం జైసల్మేర్ తో పోటీ పడుతోందని జగన్ చెప్పారు. అనంతపురం ప్రజలను ఆదుకోవాలంటే హంద్రీనీవా సుజల స్రవంతి ఒక్కటే మార్గమని చెప్పారు.
హంద్రీనీవాను రాజశేఖరెడ్డి హయాంలోనే 90 శాతం పూర్తి చేశారని.. ఈ పథకంతో రాయలసీమ నాలుగు జిల్లాలకు కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీనికి సంబంధించి 6800 కోట్లు ఖర్చవుతాయని.. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4వేల పైచిలుకు కోట్ల నిధులను కేటాయించి పనులు చేశారని చెప్పారు. అప్పట్లోనే 90 శాతం పనులు పూర్తయి కేవలం డిస్ట్రిబ్యూటరీ కెనాల్ పనులు మాత్రమే ఉన్నాయని, చంద్రబాబు అది కూడా పూర్తి చేయలేకపోతున్నారన్నారు. ఆ పది శాతం పనులు పూర్తి చేసి ఉంటే హంద్రీనీవా మొదటి దశ పూర్తయ్యేదన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగులకు చంద్రబాబు భారీగా బకాయిపడ్డారని.. ఆయన గెలిస్తే నిరుద్యోగులకు జాబు వస్తుందని చెప్పారని, అలా ఇవ్వకుంటే నెలకు రూ.2 వేలు ఇస్తామన్నారు... ఆ లెక్కన ప్రతి నిరుద్యోగికీ మొత్తం 32 నెలల చంద్రబాబు పాలన కాలానికి రూ.64 వేలు చొప్పున ఇవ్వాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/