Begin typing your search above and press return to search.
ఐటీ అంటే వణికిపోతున్నావేం బాబు?
By: Tupaki Desk | 7 Oct 2018 5:18 PM GMTఏపీ ముఖ్యమంత్రి -తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీరును వైసీపీ అధినేత వైఎస్ జగన్ విస్పష్టంగా ఎండగట్టారు. తనను తాను నిప్పు అని ప్రకటించుకునే బాబు వ్యవహారశైలిని ఆయన బట్టబయలు చేశారు. చీపురుపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ...రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఐటి అధికారులు జరుపుతున్న దాడులను చూసిన చంద్రబాబు నాయుడు తన డొంక ఎక్కడ కదులుతుందో అని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు ఎందుకు ఇంత భయమని జగన్ సూటిగా నిలదీశారు. ``చంద్రబాబునాయుడు రెండు రోజుల నుంచి శివాలెత్తిపోతున్నాడు. ఎవరింట్లోనే ఐటిదాడులు జరిగితే ఆయన ఎందుకు భయపడుతున్నారంటే ప్రతి నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలను ఇప్పటికే చేర్చారు. ఆ డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసేందుకు సొమ్మును దాచిపెట్టాడు. ఆ సొమ్ము ఎక్కడ బయటకు వస్తాయోనని చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు` అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎవరిపైనో ఐటిదాడులు జరిగితే చంద్రబాబు కేబినెట్ మీటింగ్ లు పెట్టి చర్చిస్తారు..ఇంత కన్నా దారుణమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా అని జగన్ సూటిగా ప్రశ్నించారు. ``23 మంది వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఒకొక్కరికి 30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేశాడు. ఆ వివరాలు ఎక్కడ బయటకు వస్తాయోమోనని వణికిపోతున్నాడు. రాష్ట్రంలో ఇసుక - మట్టి - బొగ్గు - కరెంటు కొనుగోలు - మద్యం - కాంట్రాక్టులు - రాజధాని భూములు - గుడి భూములు - విశాఖ భూములు - దళిత భూములు కూడా వదిలిపెట్టలేదు. ఇలా నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్లు దోచేసిన సంగతి బయటకొస్తాయోమోనని భయపడుతున్నాడు. తన అక్రమార్జనను విదేశాలకు ఎలా తరలించారని తెలిసిపోతుందనే భయంతో చంద్రబాబు వణికిపోతున్నారు.`` అంటూ జగన్ అంశాల వారీగా విరుచుకపడ్డారు.
గతంలో 2016 - 17లలో కూడా ఐటిదాడులు జరిగాయి - నాడు చంద్రబాబు ఎక్కడ మాట్లాడలేదు..కాని నేడు మాత్రం రాష్ట్రానికి - కేంద్రానికి యుద్ధం మంటూ బిల్డప్ ఇస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఇంతకన్నా దౌర్భగ్య పరిస్థితి ఉందా అని చంద్రబాబు వ్యవహారశైలిని ఎండగట్టారు. ``గతంలో కాంగ్రెస్ తో కలిసి కుట్ర పన్ని తనపై కేసులు పెట్టి దాడులు జరిపించినప్పుడు ఈ రాష్ట్రంలో యుద్ధం జరుగుతున్నట్లు అనిపించాలేదా?` అని జగన్ ప్రశ్నించారు. ఓదార్పు కోసం మాట మీద నిలబడిన వ్యక్తిని రాజకీయంగా అణగద్రోక్కడానికి చేసిన కుట్ర కేంద్రం చేసినా అన్యాయంగా నీకు కనిపించలేదా అని నిలదీశారు. తన బండారం బయటపడిపోతుందనే పరిస్థితుల మధ్యనే ఐటిదాడులను రాష్ట్రంపై యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ``చంద్రబాబు నందిని చూపించి పంది అంటే ఇదే ఎల్లో మీడియా పంది అంటోంది.ఇదే ఎలోమీడియా చంద్రబాబు పందిని చూపించి నంది అంటే..అది నంది అంటోంది చంద్రబాబు దోచేసిన దానిని అభివృద్ధి అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది` అంటూ జగన్ పేర్కొన్నారు.