Begin typing your search above and press return to search.
బాబు వెన్నులో వణుకుపుట్టేలా..జగన్ ప్రెస్ మీట్!
By: Tupaki Desk | 21 July 2018 6:11 AM GMTఏపీకి ప్రత్యేక హోదా కోసం అవిశ్వాసం పెట్టామంటూ...టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటనలపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తీరును ఎండగట్టారు. `నాలుగేళ్లుగా మేము మాట్లాడిన మాటలే గల్లా జయదేవ్ చెప్పారు..
నాలుగేళ్లుగా మేము చెబుతుంటే మమ్మల్ని వెక్కిరించారు. కోడలు మగపిల్లాడ్ని కంటాను అంటే అత్త వద్దంటుందా అన్నారు. హోదా ఏమన్నా సంజీవనా అన్నారు...హోదాకు రాయితీలకు సంబంధం లేదని మహానాడులో తీర్మానం చేశారు...ఉనికి కోసం ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయన్నారు. అరుణ్ జైట్లీ ప్రసంగాన్ని పదేపదే పొగిడారు..మనమే ఎక్కువ సాధించామంటూ సీఎం ప్రతిపక్షాలను సవాల్ చేశారు. ఇప్పుడు అదే అంశంపై మేం ఏదో చేస్తున్నామంటూ ఓట్ల రాజకీయం చేస్తున్నారు`` అంటూ జగన్ విరుచుకుపడ్డారు.
ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో ఏ ఒక్క నేత మనస్పూర్తిగా మాట్లడలేదని జగన్ అన్నారు. `తిరుపతిలో ఎన్నికల వేళ తానే ప్రత్యేక హోదాను 10 ఏళ్లు ఇస్తానని చెప్పిన మాటలు ఆయనకు గుర్తుకు రాలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు ప్రధాని గారికి గుర్తుకు రాలేదు. ఒకవైపు ప్రధానమంత్రికి గుర్తుకురాకపోగా.. ఆయన చెప్పిన మాటల్లో బాధ కలిగించిన విషయం.. చంద్రబాబు అంగీకారంతోనే హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చామని చెప్పడం.. ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? ఆయనకు ఆ హక్కు ఎవరిచ్చారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలు మానిఫేస్టోలో ఏపీకి ప్రత్యేక హోదా ఉంది దానిని మోడీ విస్మరించారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం రాహూల్ గాంధీ ఒక్క నిమిషం కూడ మాట్లడలేదు. గల్లా జయదేవ్ మట్లాడిన మాటలు మేము మా నేతలు మట్లాడినవి కావా? ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మేలు అని 2015లో మహానాడులో తీర్మానం చేసిన విషయం మరిచి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అంటు మాట మార్చడం దేనికి?`` అని జగన్ సూటిగా ప్రశ్నించారు. 3017 జనవరి 26న ప్రెస్ మీట్ పెట్టి బీజీపీ ప్రభుత్వాన్ని విపరీతంగా పొగడటం.. నిజం కాదా? అంటూ ఈ విషయమై ఈనాడు పత్రికను చూపించారు. అరుణ్ జైట్లీ ప్యాకేజ్ పేరుతో ఏపీ చెవుల్లో కాలి ఫ్లవర్ పెట్టారు. చంద్రబాబు ఆమోదంతోనే అది జరిగిందని స్పష్టమయింది. హోదా కోసం మేము పోరాడుతుంటే ఎగతాళి చేశారని అన్నారు. ``బీజేపీతో యుద్ధం అంటారు. బీజేపీ మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమించారు. బీజేపీతో యుద్ధం అంటూ....బాబుతో బంధం తెగిపోదని రాజ్ నాథ్ సింగ్ అంటారు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రోగ్రాంలో వెంకయ్యనాయుడు కూర్చుంటారు. ఇదేనా తెగిపోయిన టీడీపీ-బీజేపీ బంధం అని జగన్ నిలదీశారు. రాజ్ నాధ్ సింగ్ బీజేపీ - టీడీపీ బంధం పై స్పష్టత ఇచ్చేశారు.. వారిది ఫెవికాల్ బంధం అని తేలిపోయిందని జగన్ అన్నారు. తొలి స్పీకర్ గా టీడీపీ కే అవకాశం ఇవ్వడం - పరిమితికి మించి సమయం ఇవ్వడం వారి బంధానికి నిదర్శనమన్నారు. బీజేపీ-టీడీపీ సంబంధాల కారణంగానే వైసీపీ అవిశ్వాస తీర్మానం అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు.
టీడీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలని జగన్ సూచించారు. `` టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే కేంద్రం దిగివచ్చి ఉండేది. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయకుండా ఏపీకి అన్యాయం చేశారు. 25మంది ఎంపీలు కలిసి రాజీనామా చేసి దీక్షలు చేద్దాం. కేంద్రం ఎందుకు దిగిరాదో చూద్దాం. బీజేపీ అన్యాయాలను నిరసిస్తూ - చంద్రబాబుపై ఒత్తిడి పెంచేందుకు మంగళవారం ఏపీ బంద్ నిర్వహించనున్నాం. జులై24ఏపీ బంద్ కి వైసీపీ పిలుపు ఇస్తోంది` అని తెలిపారు.