Begin typing your search above and press return to search.

పోలవరం దోపీడికి బాబు విచారణ ఎదుర్కోవడం ఖాయం

By:  Tupaki Desk   |   27 Dec 2017 5:31 PM GMT
పోలవరం దోపీడికి బాబు విచారణ ఎదుర్కోవడం ఖాయం
X
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మ‌రోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని, అందుకే, ఈ ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. పోలవరం అవినీతిపై భవిష్యత్తులో కచ్చితంగా విచారణ జరుగుతుందని - కాంట్రాక్టులు - సబ్ కాంట్రాక్టుల పేరిట టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు.

అంతేకాదు.... ప్రాజెక్టు గేట్లలో 90 శాతం తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడే పూర్తయ్యాయని ఆయన అన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు విపరీతంగా పెంచేస్తున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా నిధులు దోచుకుంటున్నారని... భవిష్యత్తులో దీనిపై విచారణ జరగడం ఖాయమని ఆయన అన్నారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై శాతం పూర్తి చేసిన ప్రాజెక్టుల గేట్లను చంద్రబాబు ఇప్పుడు తెరిచి అంతా తానే పూర్తిచేసినట్లుగా గొప్పలు చెప్పుకొంటున్నారని ఆయన విమర్శించారు. మరోవైపు వైసీపీకి చెందిన ఇతర నేతలు కూడా పోలవరం విషయంలో చంద్రబాబు చెప్తున్న గొప్పలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అయినా... టీడీపీ నేతలు, చంద్రబాబు మాత్రం అదేమీ పట్టించుకోకుండా అంతా తన ఘనతే అంటున్నారు.

మరోవైపు కేంద్రం కూడా పోలవరం విషయంలో మరింత సునిశతంగా పరిశీలన చేస్తోంది. ఇచ్చిన నిధులు దేనికి ఖర్చు చేశారు.. నిధులు ఎలా పక్కదారి పడుతున్నాయి.. అసలు ప్రాజెక్టు డిజైన్ ఏంటి, ఏపీ ప్రభుత్వంఎలా నిర్మిస్తోందన్నది పరిశీలిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నివేదిక కూడా ఇవ్వనున్నారు.