Begin typing your search above and press return to search.

ఏపీని ఢిల్లీలో తాక‌ట్టుపెట్టిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   10 Feb 2018 8:34 AM GMT
ఏపీని ఢిల్లీలో తాక‌ట్టుపెట్టిన చంద్ర‌బాబు
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌లే ప‌రిష్కార మార్గంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌ పాద‌యాత్ర 83వ రోజు కొన‌సాగుతుంది. నెల్లూరు జిల్లాలో దుండిగం క్రాస్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జ‌గ‌న్ - సీఎం చంద్ర‌బాబుపై మండిప‌డ్డారు. గ‌తంలో ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్ర హామీకు మ‌ద్ద‌తు పలికిన చంద్ర‌బాబుపై నిప్పులు చెరుగుతూ ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై ట్వీట్ చేశారు.

ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్ర‌త్యేక హోదా కాకుండా , ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ను చంద్ర‌బాబు స్వాగ‌తించారు. దీనిపై పాద‌యాత్ర‌లో ప్ర‌స్తావించిన జ‌గ‌న్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా ప్రత్యేక సాయాన్ని చంద్రబాబు ఎలా స్వాగతిస్తారని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఐదున్నరకోట్ల రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు. జైట్లీ ప్రకటనను స్వాగతించిన చంద్రబాబు వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాపై రాజీపడిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ కేంద్ర మంత్రులను ఉపసంహరించాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు.

అంతేకాదు రాష్ట్రాన్ని విడ‌గొట్టే స‌మ‌యంలో బీజేపీ - కాంగ్రెస్ లు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చాయి. ఇదే అంశంపై చ‌ర్చించిన కేంద్ర‌మంత్రి వ‌ర్గం మార్చి 2014న ఆమోదించింది. దీన్ని కేంద్రం ప్ర‌ణాళికా సంఘానికి పంపిస్తే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టార‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు ఏం చేసింది. ప్ర‌త్యేక ప్యాకేజీ పై రాష్ట్రానికి ఏం ల‌బ్ధి చేకూరుతుందో చెప్పాల‌ని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ట్విట్‌ చేశారు.