Begin typing your search above and press return to search.
అమరావతిపై అనూహ్య ప్రకటన చేసిన జగన్
By: Tupaki Desk | 9 Nov 2017 5:05 PM GMTప్రజలకు చేరువ అవడం...పార్టీని బలోపేతం చేసుకోవడం - 2019 ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించే శక్తిగా ఎదిగేందుకు పాదయాత్ర ఫార్ములాతో ప్రజాక్షేత్రంలోకి దిగిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక అంశాలు ప్రస్తావించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకత - కేంద్రంలో-రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవడం - నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం - జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం వంటి అంశాలపై జగన్ విపులంగా స్పందించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోసం తన ప్రయత్నం కొనసాగుతుందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రత్యేక హోదా అనేది తప్పనిసరి అని పేర్కొంటూ...అభివృద్ధి చెందిన నగరాలయిన ఢిల్లీ - ముంబై - చెన్నై - హైదరాబాద్ వంటి నగరాలతో ధీటుగా ఎదిగేందుకు ప్రత్యేక హోదా ఆయువుపట్టుగా ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీనే తాము గుర్తు చేస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు. 2014 ఎన్నికల సందర్భంగా తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోదా హామీ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత మాట మార్చుకున్నారని తప్పుపట్టిన జగన్..ఈ పాదయాత్ర ద్వారా బీజేపీ తన ఆలోచన తీరును మార్చుకుంటుందని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనాలు తెలుసునని చెప్పారు. తన పాదయాత్ర కేవలం ప్రత్యేక హోదా గురించి మాత్రమే కాదని - పలు అంశాల్లో ఇది కూడా ఒక అంశమని జగన్ వివరించారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుపునకు అనేక కారణాలు ఉన్నాయని ఈ సందర్భంగా జగన్ విశ్లేషించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ హవా ఉండటం - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలకడం - పరిపాలకుడిగా తన అనుభవం పనికి వస్తుందని ప్రచారం చేసుకోవడం - ఇష్టారీతిన హామీలు ఇవ్వడంజజజజబాబు విజయానికి కారణంగా నిలిచాయని వైసీపీ అధినేత వివరించారు. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు ఉందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్దాలాడారని ప్రజలు గుర్తించారని....బాబు పాలనపై ఇప్పుడు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని జగన్ అన్నారు.
రాబోయే ఎన్నికలు, బీజేపీతో దోస్తీ గురించి జగన్ స్పందిస్తూ...బీజేపీకి తాను అంశాల వారీగా మద్దతిస్తున్నానని జగన్ వివరించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై తమ నిరసనను స్పష్టం చేస్తున్నామని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా, భూసంస్కరణలకు తాము వ్యతిరేకమని చెప్పారు. 2014 ఎన్నికల్లో మోడీ హవా కొనసాగిందని పేర్కొంటూ..రాబోయే ఎన్నికల్లో అదే పరిస్థితి ఉంటుందో తెలియదన్నారు. తాను ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆచరణలో దాన్ని నిలుపుకోలేకపోయారని వైఎస్ జగన్ తప్పుపట్టారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇందుకు సరైన ఉదాహరణ అని జగన్ పేర్కొన్నారు. తాత్కాలిక భవనాల పేరుతో వందల కోట్ల రూపాయలు వృథా చేశారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినప్పటికీ...ఇంకా డిజైన్ల దశలోనే సీమాంద్రుల రాజధాని ఉండటాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాగా, తాము అధికారంలోకి వస్తే...రాజధాని నిర్మాణం విషయంలో అమరావతిని మార్చే ప్రసక్తిలేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.