Begin typing your search above and press return to search.
కేసీఆర్ పై జగన్ ప్రశ్నల వర్షం
By: Tupaki Desk | 18 May 2016 10:53 AM GMTతన రహస్య రాజకీయ మిత్రుడు కేసీఆర్ పై వైసీపీ అధినేత జగన్ ప్రజాముఖంగా ప్రశ్నల వర్షం కురిపించారు. అధికార బలం ఉందన్న ధైర్యంతో పేదలైన తమ మీద ప్రతాపం చూపడం భావ్యమేనా..? అని సూటిగా ప్రశ్నించారు. మహబూబ్ నగర్ లోనే నీళ్లన్నీ లాక్కుంటే శ్రీశైలానికి నీళ్లెలా వస్తాయని జనగ్ కేసీఆర్ ను ఉద్దేశించి నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులతో రాయలసీమ - ప్రకాశం - నెల్లూరుకి నీళ్లు రాకుండా పోతాయని అన్నారు. మహారాష్ట్ర - కర్ణాటక అవసరాలు తీరాక మహబూబ్ నగర్ కి నీరొస్తే.. అక్కడి నుంచి తెలంగాణ మొత్తం నీరు లాక్కుంటే ఇక ఏపీకి నీళ్లెలా వస్తాయని అడిగారు.. గోదావరి నీటి విషయంలోనూ తెలంగాణ అన్యాయంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఏపీకి రాకుండా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణ అక్రమంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులకు - వాటి పట్ల ఏపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా కర్నూలులో మూడు రోజులుగా దీక్ష చేస్తోన్న జగన్ కొద్దిసేపటి కిందట తన దీక్ష విరమించారు. జగన్ కు నిమ్మరసం ఇచ్చిన వైసీపీ నేతలు - రైతులు ఆయనతో దీక్షను విరమింపజేశారు. జలదీక్ష సందర్భంగా మూడు రోజులుగా వైసీపీ నేతలు ఇటు టీడీపీ ప్రభుత్వం - ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.
దీక్ష ముగింపు అనంతరం జగన్ మాట్లాడుతూ వ్యవస్థలో మార్పు రావలని.. దీని కోసం మనం కృషి చెయ్యాలని జగన్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర - ఏపీ - తెలంగాణ అన్ని రాష్ట్రాలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. అందరూ కలిసుంటే కరవును ఎదుర్కోవచ్చని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎగువ రాష్ర్టాల జలదోపిడీకి వ్యతిరేకంగా అంతా కలిసి పోరాడిన సంగతిని జగన్ గుర్తు చేశారు.