Begin typing your search above and press return to search.

మహానాయకుడు ముద్దు..లక్ష్మీస్ ఎన్టీఆర్ వద్దా?

By:  Tupaki Desk   |   30 March 2019 11:16 AM GMT
మహానాయకుడు ముద్దు..లక్ష్మీస్ ఎన్టీఆర్ వద్దా?
X
లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఈ మధ్య కాలంలో ఈ చిత్రంపై వచ్చిన వివాదాలు ఏ చిత్రంపై రాలేదు.. దివంగత ఎన్టీఆర్ చివరిక్షణాల్లో వెన్నుపోటుకు గురై సీఎం పదవిని కోల్పోయి గుండెపోటుతో మరణించిన ఇతివృత్తాన్ని తీసుకొని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ఈ చిత్రం తెలంగాణతోపాటు యావత్ దేశం - ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కానీ ఇందులో చంద్రబాబునే విలన్ గా చూపించడంతో ఏపీలో మాత్రం దీని విడుదల చేయకుండా హైకోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు.

తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏపీలో విడుదల చేయకపోవడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విమర్శించారు. ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకోవడంపై శుక్రవారం ఓ బహిరంగ సభలో వైఎస్ జగన్ నిప్పులు కురిపించారు. మహానాయకుడు వాళ్ల సినిమా అని..ఆ సినిమానే చూడాలని అంటున్నారని.. చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా ఈ సినిమా లేదని.. ఎన్టీఆర్ జీవిత చరిత్రనే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారని.. సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ సినిమాను అడ్డుకోవడం దారుణమన్నారు.

వాళ్ల సినిమాలే చూడాలని.. వాళ్ల పేపర్లే చదవాలని.. వాళ్ల టెలివిజన్ చానెళ్లనే చూడాల్సిన ఖర్మ ప్రజలకు వచ్చిందని వైఎస్ జగన్ విమర్శలు కురిపించారు. ఇలాంటి ప్రభుత్వానికి ఓటు వేస్తే ఇక స్వేచ్ఛ ఉండదని.. వాళ్ల సినిమాలే చూడాలంటారని.. వైఎస్ జగన్ మండిపడ్డారు.

ఇక జగన్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై మాట్లాడిన వీడియోను షేర్ చేసిన రాంగోపాల్ వర్మ దీనిపై స్పందించారు. ఏపీలో తన సినిమాను రిలీజ్ కాకుండా ఆపడం దారుణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్అయిన ఈ సినిమా ద్వారా ప్రజలకు నిజం తెలుస్తుందని అన్నారు. ఏపీలో త్వరగా రిలీజ్ చేయడానికి సుప్రీం కోర్టును ఆశ్రయించాం అని వర్మ పేర్కొన్నారు.

కాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ఒక్క ఏపీలో తప్ప ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న రిలీజ్ అయ్యింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ కాకుండా ఏపీ హైకోర్టు స్టే విధించడం వివాదంగా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి