Begin typing your search above and press return to search.
అధ్యక్షా..అంటూ సీఎం జగన్ తొలి స్పీచ్ లోనే భారీ పంచ్!
By: Tupaki Desk | 13 Jun 2019 7:07 AM GMTచేసిన పాపం ఊరికే పోదంటారు. హద్దులు మీరి చేసే అత్యాశను దేవుడు కూడా నో చెప్పేస్తారంటారు. ఇలాంటి మాటలకు తగ్గట్లే.. జరిగిన ఉదంతాల్ని నిండు అసెంబ్లీలో ప్రస్తావించిన ఏపీ సీఎం జగన్.. విపక్ష నేత బాబు నోట మాట రాకుండా చేశారు.
ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ను ఎన్నుకున్న తర్వాత.. సీఎం జగన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలుగుదేశం పార్టీ విషయంలో దేవుడు అద్భుతమైన స్క్రిప్ట్ రాశారన్నారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందనటానికి తాజాగా జరిగిన ఎన్నికలే నిదర్శనం అధ్యక్షా అని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన వారికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అధ్యక్షా? అక్షరాల 23 సీట్లు. ఎంపీలను కొన్నవారికి ముగ్గురు ఎంపీలను కొన్న వారికి అక్షరాల వాళ్లకు వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా అధ్యక్షా? మూడు. అది కూడా అధ్యక్షా? ఎప్పుడొచ్చిందో తెలుసా? అది కూడా 23న. ఎంత గొప్పగా జరిగిందంటే.. దేవుడు ఇలా కూడా స్క్రిప్ట్ రాస్తాడు అధ్యక్షా అని వ్యాఖ్యానించారు. జగన్ మాటలకు విపక్ష నేత చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు.
(23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్ని బాబు సీఎంగా ఉన్నప్పుడు లాగేస్తే.. తాజా ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది. ఆ ఫలితం మే 23న వచ్చింది. ఇదే విషయాన్ని జగన్ అసెంబ్లీలో ప్రస్తావించారు)