Begin typing your search above and press return to search.

బ‌ద్వేల్ పై జ‌గ‌న్ దృష్టి, క‌స‌ర‌త్తు మొద‌లు!

By:  Tupaki Desk   |   30 Sep 2021 9:32 AM GMT
బ‌ద్వేల్ పై జ‌గ‌న్ దృష్టి, క‌స‌ర‌త్తు మొద‌లు!
X
త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దృష్టి సారించారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల‌, క‌డ‌ప జిల్లా ఇన్ చార్జి మంత్రి ఆదిమూల‌పు సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ సుధ‌, క‌డ‌ప జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌తో ఈ స‌మావేశం జ‌రిగింది.

బ‌ద్వేల్ లో భారీ మెజారిటీతో తాము విజ‌యం సాధిస్తామ‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వాసం వ్య‌క్తం చేస్తోంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వ‌చ్చిన మెజారిటీ క‌న్నా ఇప్పుడు ఎక్కువ మెజారిటీ సాధిస్తామ‌ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వ‌యంగా పార్టీ నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. విజ‌యానికి అనుస‌రించిన వ్యూహాల గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగి ఉండ‌వ‌చ్చు. విజ‌యంపై పూర్తి ధీమాతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ని పెంచుకోవ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను చ‌ర్చించిన‌ట్టుగా తెలుస్తోంది.

బ‌ద్వేల్ బై పోల్ కు అక్టోబ‌ర్ ఒక‌టో తేదీన నోటిఫికేష‌న్ విడుఆల కానుంది. అక్టోబ‌ర్ ఎనిమిది వ‌ర‌కూ నామినేష‌న్ల‌కు అవ‌కాశం ఉంటుంది. 11న ప‌రిశీల‌న‌, 13న నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు. అక్టోబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌బోతోంది, నంబ‌ర్ రెండున ఫ‌లితాల వెల్ల‌డి జ‌ర‌గ‌నుంది.

ఇక ఇత‌ర పార్టీలు కూడా బ‌ద్వేల్ మీద దృష్టి పెట్టాయి. టీడీపీ ఇప్ప‌టికే అక్క‌డ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించింది. బీజేపీ-జ‌న‌సేన‌లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు సాగిస్తూ ఉన్నాయి. ఆ రెండు మిత్ర‌ప‌క్ష పార్టీల్లో ఏ పార్టీ పోటీలో ఉంటుంద‌నేది ఇంకా స్ప‌ష్ట‌త లేని అంశ‌మే.