Begin typing your search above and press return to search.

రోడ్ల రచ్చకు పుల్ స్టాప్ పెట్టేలా జగన్ ఫోకస్

By:  Tupaki Desk   |   7 Sep 2021 5:47 AM GMT
రోడ్ల రచ్చకు పుల్ స్టాప్ పెట్టేలా జగన్ ఫోకస్
X
రోడ్ల రచ్చకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుల్ స్టాప్ పెట్టేశారు. పనికట్టుకొని మరీ రోడ్ల దుస్థితిపై ఎలుగెత్తిన విపక్షాల విమర్శలు మరిక చేయలేని రీతిలో ఆయన పూర్తిస్థాయిలో యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేశారు. భారీగా ధ్వంసమైన రోడ్ల రూపురేఖల్ని మార్చేలా ఆయన తాజా నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాలం వేళ రోడ్ల వేయరా? అన్న ప్రశ్నకు.. వర్షాకాలంలో ఎవరైనా రోడ్లు వేస్తారా? అంటూ సూటిగా ప్శ్నిస్తున్నారు. అదే పనిగా రోడ్ల దుస్థితిపై ఏపీ విపక్షాలు కలిసికట్టుగా ఎదురుదాడి చేస్తున్న వేళ.. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సుదీర్ఘ సమీక్షను నిర్వహించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇందులో మంత్రులతో పాటు ఆయా శాఖలకు చెందిన అధికారులు కూడా హాజరయ్యారు.

ఎప్పటినుంచి రోడ్ల నిర్మాణ పనులు షురూ చేయాలి.? మరెప్పుడు వాటిని పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ఫిక్సు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని.. ఆ తర్వాత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలన్న సూచన చేశారు. వచ్చే వర్షాకాలం నాటికిరోడ్ల మీద గుంతలు లేకుండా చేయటమే లక్ష్యమని చెప్పారు. రోడ్ల మరమ్మతు.. వాటి నిర్మాణానికి చాలావరకు టెండర్లు పిలిచామని.. ఎక్కడైనా టెండర్లు పిలవకపోతే ఆ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని.. అక్టోబరులో వర్షాలు పూర్తి అయిన వెంటనే ఆ పనుల్ని మొదలు పెట్టాలన్నారు.

గత ప్రభుత్వం రోడ్లను విస్మరించిందని.. చంద్రబాబుతో కాకుండా ఒక వర్గానికి చెందిన మీడియాతో యుద్ధం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పు పట్టటం.. విమర్శలు ఎత్తి చూపటమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఎంత నెగిటివ్ గా ప్రచారం చేసినా.. పట్టించుకోమని తేల్చారు. రోడ్ల దుస్థితి మీద క్షేత్ర స్థాయ నివేదికల్ని తెప్పించుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా రోడ్ల మీద విపక్షాలు టార్గెట్ చేసిన వేళ.. దానికి చెక్ పెట్టేలా జగన్ యాక్షన్ ప్లాన ఉందన్న విషయాన్ని తాజా సమీక్ష సమావేశంతో స్పష్టం చేశారని చెప్పాలి.