Begin typing your search above and press return to search.
లోకల్ ఎన్నికల్లో కేసీఆర్ ను ఫాలో కానున్న జగన్
By: Tupaki Desk | 5 March 2020 9:00 AM GMTఏపీలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి? వ్యూహం ఏమిటన్న విషయంలో ఏపీ సీఎం జగన్ చాలా స్పష్టంగా ఉన్నారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో పార్టీ విజయ దుందుబి మోగించేందుకు అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు ఎవరెవరు ఏ స్థాయిల్లో బాధ్యులన్న విషయంపై తనకున్న స్పష్టతను మంత్రివర్గ సమావేశంలో అందరికి అర్థమయ్యేలా చేశారు జగన్.
అంతేకాదు.. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు. ఇటీవల తెలంగాణలో ముగిసిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర అధికారపక్షం అనుసరించిన వూహ్యాన్నే తాము కూడా ఫాలో అవ్వాలన్న తన ఆలోచనను జగన్ చెప్పేశారు. వీలైనంత వరకూ ఏకగ్రీవాల మీదనే ఫోకస్ పెట్టాలన్న జగన్.. సర్పంచ్.. ఎంపీపీ.. జెడ్పీ ఛైర్మన్.. మున్సిపల్ ఛైర్మన్.. మేయర్ పదవులు ఎవరికి ఇవ్వాలనుకున్న విషయాల్ని ఎవరికి ముందస్తుగా హామీ ఇవ్వొద్దని స్పష్టం చేశారు.
ఒకవేళ ముందస్తుగా హామీలు ఇస్తే.. సొంత పార్టీ నేతలే వెన్నుపోట్లు పొడిచే అవకాశం ఉందని..పార్టీ ఓడేలా చేసే ప్రమాదం ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఎన్నికలు పూర్తి అయ్యాక ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి.. ఆ కమిటీ.. జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు.. మంత్రులు.. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాతే నేతలకు పదవుల్ని అప్పగిస్తామని చెప్పినట్లుగా చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాలో అయిన వ్యూహాన్నే జగన్ పాటిస్తారన్న సంకేతాలు ఆయన మాటల్లో వినిపించినట్లుగా చెబుతున్నారు.