Begin typing your search above and press return to search.
ఓల్డ్ కాంగ్రెస్ ట్రెండ్ : ఓట్లు కురిపిస్తుందా జగనూ...?
By: Tupaki Desk | 14 Jun 2022 2:30 AM GMTకాంగ్రెస్ కి ఒక కల్చర్ ఉండేది. ఆ పార్టీలో సీనియర్లు, అధినేతలు సుప్రీంలు అంతా తెర వెనక ఉండేవారు. వారు ఎపుడో గానీ జనాల్లోకి వచ్చేవారు కాదు, తమ మంత్రులను, ఎమ్మెల్యేలను జనాల్లోకి పంపేవారు. వారు మాత్రం ఏదో ఒక కార్యక్రమంలో ఎంచుకున్న జిల్లాకు వచ్చి బహిరంగ సభ పెట్టి నాలుగు ముక్కలు మాట్లాడి వెళ్లిపోయేవారు. అప్పట్లో అంటే కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధనరెడ్డి వంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల జమానాలలో ఇదే రకమైన ట్రెండ్ ఉండేది.
ఇపుడు చూస్తే జగన్ దాన్నే కంటిన్యూ చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. జగన్ కూడా పాత కాంగ్రెస్ ముఖ్యమంత్రుల మాదిరిగా బయటకు రావడం చాలా తక్కువ. ఆయన ఎంతసేపూ తమ తాడేపల్లి క్యాంప్ అఫీసులోనే కూర్చుని సమీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ఏదైనా ప్రారంభోత్సవం ఉంటేనే ఆయన బయటకు వస్తారు. అదే విధంగా ఆయన ఆ మీటింగ్ చూసుకుని తిరిగి వెళ్ళిపోతున్నారు.
మూడేళ్ళ ముఖ్యమంత్రిత్వంలో జగన్ పెద్దగా జనాల్లోకి రాలేదు అన్నది ఒక విమర్శగా ఉంది. పాదయాత్ర పేరిట జగన్ నాడూ రాష్ట్రమంతా అణువణువూ తిరిగి జనాలకు చేరువ అయ్యారు. కోట్లాది మందిని ప్రత్యక్షంగా కలిశారు. అటువంటి జగన్ సీఎం కాగానే జనాలకు దూరంగా ఉండడం అంటే నెగిటివిటీనే పెంచుతోంది. పదవి కోసం నాడు తిరిగి ఇపుడు కుర్చీ ఎక్కగానే వారికి దూరంగా జరుగుతున్నారు అని విపక్షాల విమర్శలకు కూడా జగన్ సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది.
అయితే జగన్ ఒక ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు అని ఆయన్ని నిశితంగా గమనించిన వారు చెబుతున్నారు. ప్రతీ దానికీ సీఎం వెళ్ళిపోకూడదని, ప్రతీ రోజూ సీఎం కనిపించకూడదని ఆయన భావనగా చెబుతున్నారు. మంత్రులు ఇతర నాయకులు జనాల్లో ఉండాలని అంతిమ నిర్ణయాధికారంతో సీఎం స్థానంలో ఉండాలన్నది ఆయన మార్క్ ఆలోచన అని చెబుతారు.
గతంలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఇలాగే చేసేవారు. 1980 ప్రాంతంలో చూసుకుంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వరసగా మారిపోయారు. వారంతా రాజ ప్రాసాదాలలో ఉంటే ఉవ్వెత్తున ఎగిసిపడిన కడలి తరంగంలా ఎన్టీయార్ జనంలోకి వచ్చారు. ఆయన అంతటా తిరిగి ఏపీలో కోట్లాది మంది జనాలను కదిలించారు. అలా అధికారంలోకి వచ్చారు.
ఇక ఎన్టీయార్ తన పదవీ కాలంలో తరచూ జనాల్లోకే వచ్చేవారు. ఇక స్థానిక ఎన్నికలపుడు కూడా ఎన్టీయార్ ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీయార్ తరువాత వచ్చిన చంద్రబాబు కూడా నెలలో అధిక రోజులు జనంలోనే గడుపుతూ వచ్చారు. అదే ఒరవడిని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా అలవరచుకున్నారు.
ఆయన తన అయిదుంపావు ఏళ్ళ ముఖ్యమంత్రిత్వంలో జనంలో ఎక్కువగా కనిపించానికి ఉత్సాహం చూపించేవారు. మరి విభజన ఏపీలో కూడా చంద్రబాబు జనమే మనం అన్నట్లుగా తిరిగేవారు. మీడియాతో కూడా ముచ్చట్లు పెట్టేవారు. ప్రభుత్వం అన్నది నడుస్తోంది అన్నట్లుగా ఈ రకంగానే తెలిసేది. దాదాపుగా ప్రతీ రోజూ బాబు మీడియాతో ఉండేవారు. కానీ జగన్ వచ్చాక మీడియాతో మీటింగ్స్ అన్నవి కట్ అయ్యాయి.
ఆయన ఢిల్లీ వెళ్ళినా ప్రధానిని కలసినా ప్రెస్ నోట్ మాత్రమే సీఎంవో నుంచి వస్తుంది. అంతే తప్ప నేరుగా మాట్లాడి ఎరగరు. ఇపుడు విపక్షాలు జనాలలోకి దూసుకుపోతున్న జగన్ మాత్రం మంత్రులతో బస్సు యాత్ర చేయించారు. గడపగడపకూ మన ప్రభుత్వం అని అందరినీ తిరగమంటున్నారు. అదంతా బాగానే ఉన్నా సీఎం గా ఆయన జనాల్లోకి వచ్చి టూర్లు చేస్తేనే పార్టీకి ప్రభుత్వానికి హైలెట్ అవుతుందని అంటున్నారు.
ఇపుడు చూస్తే జిల్లాల పర్యటనకు చంద్రబాబు రెడీ అయిపోయారు. మరో వైపు బస్సు యాత్ర పేరిట పవన్ కూడా రాష్ట్రం చుట్టేయాలనుకుంటున్నారు. వైసీపీ ప్రచార సరళి మాత్రం ఆ పార్టీ వారికే అర్ధం కావడంలేదుట. అయితే జగన్ ఇంకా 80ల నాటి ఓల్డ్ కాంగ్రెస్ ట్రెండ్ ని ఫాలో అయి ఎన్నికల ముందు బహిరంగ సభలలో పాల్గొంటే అప్పటికి పుణ్యకాలం మించుతుంది అని ఆ పార్టీ వారు ఆందోళన చెందుతున్నారుట.