Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ జ‌ట్టులో సెకండ్ సెంటిమెంట్‌!

By:  Tupaki Desk   |   8 Jun 2019 5:58 AM GMT
జ‌గ‌న్ జ‌ట్టులో సెకండ్  సెంటిమెంట్‌!
X
అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి డ్రీం జ‌ట్టు తెర మీద‌కు వ‌చ్చేసింది. కాసేప‌ట్లో పూర్తిస్థాయి కాబినెట్ కొలువుతీర‌నుంది. రెండు తెలుగు రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ మంత్రులుగా ఎంపికైన వారి చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయిస్తారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం పాతిక మందికి అవ‌కాశం ఇచ్చేందుకు వీలున్న నేప‌థ్యంలో పాతిక మందిని ఒకే ద‌ఫాలో ఎంపిక చేశారు. రెండున్న‌రేళ్లు మాత్ర‌మే ఉంటార‌న్న మాట చెబుతున్న జ‌గ‌న్ జ‌ట్టును చూస్తే ఆసక్తిక‌ర అంశాలు క‌నిపిస్తాయి.

జ‌గ‌న్ జ‌ట్టులో అత్యంత సీనియ‌ర్ ఒక్క‌రు మాత్ర‌మే ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని కాబినెట్ లోకి తీసుకున్నారు. మొత్తం పాతిక మంది టీంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒకేఒక్క‌రుగా ఆయ‌న్ను చెప్పాలి. అదే స‌మ‌యంలో ఐదుసార్లు గెలిచిన బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డికి మంత్రిప‌ద‌వి ల‌భించింది.

జ‌గ‌న్ టీంలో చోటు ల‌భించిన వారిలో నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగాఎన్నికైన వారిలో ముగ్గురున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఐదుగురున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. కేవ‌లం రెండుసార్లు మాత్ర‌మే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే.. జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో ఎక్కువ‌గా ఉండ‌టం విశేషం. వారు ఏకంగా 14 మంది ఉన్నారు. అంటే.. మొత్తం వంద‌శాతం మంత్రుల్లో దాదాపు యాభై శాతం మంది మంత్రులు రెండోసార్లు గెలిచిన వారే కావ‌టం గ‌మ‌నార్హం. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన ఇంకో విష‌యం ఏమంటే.. అనంత‌పురం జిల్లా పార్టీ అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఎం. శంక‌ర్ నారాయ‌ణ ఎమ్మెల్యే కాకున్నా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ల‌భించింది. రానున్న ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి ప‌ద‌వి ఇవ్వ‌నున్న‌ట్లుగా చెప్పాలి.

ఇక‌.. జిల్లాల వారీగా చూస్తే.. మూడు జిల్లాల‌కు మాత్రం ముగ్గురు చొప్పున మంత్రి ప‌ద‌వులు ల‌భించాయి. అత్య‌ధిక మంత్రిప‌ద‌వులు ల‌భించిన జిల్లాలుగా కృష్ణా.. తూర్పు.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలు కావ‌టం విశేషం. అదే స‌మ‌యంలో కేవ‌లం ఒక్క మంత్రి ప‌ద‌వి ల‌భించిన జిల్లాలు నాలుగు కాగా.. ఇద్ద‌రు మంత్రుల‌కు అవ‌కాశం ల‌భించిన జిల్లాలు అత్య‌ధికంగా ఉన్నాయి. ఆరు జిల్లాల‌కు మాత్రం ఇద్ద‌రేసి చొప్పున మంత్రుల్ని ఎంపిక చేశారు.

ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు గెలిచిన వారికి చోటు ల‌భించిందంటే..

రెండుసార్లు: 14 మంది
మూడుసార్లు: (5)
నాలుగుసార్లు: (3)
ఐదుసార్లు:1
ఆరుసార్లు: 1
+ ఎం. శంక‌ర్ నారాయ‌ణ (అనంత‌పురం జిల్లా పార్టీ అధ్య‌క్షుడు)

జ‌గ‌న్ జ‌ట్టులో జిల్లాల వారీగా ప్రాతినిధ్యం చూస్తే..

అనంత‌పురం: 1
క‌డ‌ప: 1
చిత్తూరు: 2
క‌ర్నూలు: 2
నెల్లూరు: 2
ప్ర‌కాశం: 2
గుంటూరు: 2
కృష్ణా: 3
ప‌శ్చిమ గోదావ‌రి: 3
తూర్పు గోదావ‌రి: 3
విశాఖ‌ప‌ట్నం : 1
విజ‌య‌న‌గ‌రం: 2
శ్రీ‌కాకుళం: 1