Begin typing your search above and press return to search.
వైసీపీ రైతు ఎజెండా..రైతులను ఆకట్టుకుంటోందే
By: Tupaki Desk | 23 Dec 2017 4:48 PM GMTదేశానికి ఆహార భద్రత ఇచ్చే అన్నదాతలు ఇంటికి ఆర్థిక భద్రత ఇవ్వలేక...ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు పాలకులు భరోసా ఇవ్వడం అత్యంత ముఖ్యం. పాలకులు వైఫల్యం చెందిన సమయంలో...ప్రజల పక్షాన నిలిచే ప్రతిపక్షం ఆ ధైర్యాన్ని కలిగించాలి. ప్రదాన ప్రతిపక్షంగా వైసీపీ ఈ ఎజెండాలో విజయం సాధించిందని అంటున్నారు. రైతుకు ఎంత ఇచ్చిన కూడా తక్కువే అన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచన రీతిలోనే వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని చెప్తున్నారు. అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల అవస్థలపై పార్టీ నేతలు అన్నదాతల స్థితిగతుల గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం. ఏపీలో 62 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. వారు ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఉంది. స్థూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దేశంలోనే తలసరి అప్పు ఉన్న రైతులు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయనే రికార్డులు చెప్తున్నాయి. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ ఏ ఊరుకు వెళ్లినా.. ఏ రైతు దగ్గరకు వెళ్లినా మా పంటలకు గిట్టుబాటు ధర లేదని మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. రైతు పంటకు మద్దతు ధర కల్పించలేనప్పుడు ఇక ప్రభుత్వం ఎందుకని అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటినీ పట్టించుకోరు.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించరు.. ఇలా పరిస్థితులు దిగజారుతున్నప్పుడు వాటిని చక్కదిద్దాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపై ఉన్నప్పటికీ , ఆ దిశగా ఆలోచించకపోగా.. రైతులను మరింత సంక్షోభంలోకి నెట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారన్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ముందు మీరు బ్యాంకు రుణాలు కట్టవద్దని.. అధికారంలోకి వచ్చాక మొత్తం మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు నిండా ముంచేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐదు విడతల్లో రుణ మాఫీ అని చెప్తూ...లబ్ధిదారుల జాబితా పేరుతో సమయాన్ని గణనీయంగా తగ్గించారని ఆరోపిస్తున్నారు. అసలు రైతులు అవునా కాదా అని విచారణ పేరుతో 87 లక్షలున్న రైతులను 27 లక్షలుగా చూపించారని పేర్కొన్నారు.. మేనిఫెస్టోలో పెట్టునట్లుగా ఆత్మహత్య చేసుకున్న రైతుకు రూ. 5 లక్షల ఇస్తున్నారా అనేది చంద్రబాబు ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తున్నారు. నాలుగేళ్లుగా రైతుకు చేసిన మేలుపై శ్వేతపత్రం విడుదల చేయగలరా అని వైసీపీ నేతలు బహిరంగ సవాల్ విసరుతున్నారంటే...అన్నదాతలు ఏ స్థాయిలో కష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చునని అంటున్నారు.
రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్భాటంగా చేపట్టిన రెయిన్‌గన్‌ల ప్రయోగం విఫలమైందని...అన్ని పంటల ధరలు కుప్పకూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువుతో రైతులు రాష్ట్రాన్ని వదిలి కూలీలుగా పక్క రాష్ట్రాలకు వలస పోయే పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. నకిలీ విత్తనాలు రైతుల నడ్డి విరిచారు. కేంద్ర ప్రభుత్వం మీద ఏనాడు రైతుల కోసం ఒత్తిడి తీసుకురాలేదని వ్యాఖ్యానిస్తున్నారు. అంందుకే రైతును రాజుగా చూడాలనుకున్న వైఎస్సార్ ఆశకు ఊతం ఇస్తూ ఐదెకరాల లోపు పొలం ఉన్న ప్రతిరైతుకు ఏటా 50 వేల రూపాయిలు భరోసాగా అందిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని చెప్తున్నారు.