Begin typing your search above and press return to search.
జగన్ ఫారిన్ టూర్ వాయిదా.. ఈసారికి వివాహ వేడుకలు ఎక్కడంటే?
By: Tupaki Desk | 26 Aug 2021 3:30 AM GMTకుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్యారిస్.. అనంతరం లండన్ వారు వెళ్లాలనుకోవటం.. దీనికి సంబంధించిన వార్తలు రావటం కూడా తెలిసిందే. ఉన్నట్లుండి కుటుంబ సభ్యులతో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలన్న ప్లాన్ వెనుక వారి సిల్వర్ జూబ్లీ వివాహ వేడుక కోసమన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఫారిన్ ట్రిప్ తాజాగా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.
ఫారిన్ ట్రిప్ నకు భిన్నంగా హిమాలయ పర్వతాలు కనువిందు చేసే సిమ్లాలో వేడుకలు జరుపుకోవటానికి వీలుగా ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. మొదట్లో అనుకున్నట్లు విదేశీ పర్యటన కాకుండా దేశీయ పర్యటనకు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. జగన్ తో పాటు ఆయన సతీమణి భారతి కూడా ఫారిన్ ట్రిప్ నకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవటం తెలిసిందే.
యూరప్ లో మూడో వేవ్ తీవ్రంగా ఉండటం.. ఇలాంటివేళ అక్కడకు వెళ్లటం ఏ మాత్రం మంచిది కాదని.. సన్నిహితుల సలహాతో పాటు.. అధికారులు కూడా ఇదే విషయాన్ని సూచించినట్లుగా తెలుస్తోంతోంది. అందుకే.. విదేశీ పర్యటనకు అనుకున్న షెడ్యూల్ ను దేశీయ పర్యటనగా మార్పు చేయనున్నట్లు చెబుతున్నారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారమే వారి టూర్ సాగుతుందని.. కాకుంటే ప్యారిస్ కాకుండా సిమ్లాకు వెళతారని చెబుతున్నారు. అయితే.. జగన్ కుటుంబం వెళ్లేది సిమ్లా కాదు.. డెహాడూన్ అన్న వాదనను కూడా వినిపిస్తున్నారు.
దాదాపు మూడు రోజుల పాటు వారి ట్రిప్ కొనసాగనుంది. ఆగస్టు 29 సాయంత్రం వారు విజయవాడకు తిరిగి రానున్నట్లు చెబుతున్నారు. గడిచిన రెండేళ్లుగా తాడేపల్లికే పరిమితమైన జగన్.. పనుల హడావుడిలో బిజీబిజీగా గడపటం తెలిసిందే. ఇలాంటివేళ.. తాజా ట్రిప్ ఆయనకు కచ్ఛితంగా మంచి బ్రేక్ అవుతుందన్న మాట వినిపిస్తోంది.