Begin typing your search above and press return to search.

జలం కోసం రుణం.. జగన్ భగీరథ యత్నం

By:  Tupaki Desk   |   29 Oct 2019 11:01 AM GMT
జలం కోసం రుణం.. జగన్ భగీరథ యత్నం
X
రాజధాని కూడా లేకుండా విభజించిన ఏపీకి ఆర్థిక లోటు ఎక్కువ. అందుకే ప్రత్యామ్మాయ మార్గాల ద్వారా నిధుల సమీకరణకు పూనుకుంటోంది. ఏపీలో గద్దెనెక్కిన వైసీపీ సర్కారు భారీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా ప్లాన్ చేస్తోంది.

భారీ ప్రాజెక్టులకు నిధులు సేకరించేందుకు వీలుగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జలవనురుల శాఖ పై సమీక్ష సందర్భంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి 30వేల కోట్లకు పైబడి వ్యయమయ్యే ప్రాజెక్టులను కార్పొరేషన్ ద్వారా చేపట్టాలని డిసైడ్ అయ్యారు.

రానున్న ఐదేళ్లలో ఏపీలో పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని జగన్ సర్కారు యోచిస్తోంది. ఈ నిర్మాణల ఖర్చును భరించే స్థితిలో ప్రభుత్వం లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యానే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు వీలుగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాధాన్య - అప్రధాన్య జాబితాలను సిద్ధం చేసి నిధులు కేటాయించాలని జగన్ సూచించారు. హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. దాని నుంచి అనుసంధానమయ్యే ప్రాజెక్టులను మొదల పూర్తి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో 25శాతంలోపు చేపట్టిన అన్ని పనులను రద్దు చేయాల్సిన అవసరం లేదని.. ప్రయోజనాల ప్రకారం ముందుకెళుదామని జగన్ అభిప్రాయపడ్డారు.