Begin typing your search above and press return to search.
జగన్... నిజంగానే జన నేతే!
By: Tupaki Desk | 1 July 2017 4:40 AM GMTవైఎస్ జగన్ మోహన్ రెడ్డి... వైసీపీ అధినేతగా ఏపీలో విపక్ష నేత హోదాలో జగమంతా తెలిసిన నేతే. జనానికి తెలిసిన నేతే కాదండోయ్... జనం మనసులను గెలుచుకున్న నేత కూడానూ. ఒక్కమాటలో చెప్పాలంటే... వైసీపీ నేతలు చెబుతున్నట్లుగా ఆయన నిజంగానే జన నేతే. ఇందుకు నిన్న ఆయన జరిపిన పర్యటనే నిదర్శనంగా నిలుస్తోంది. అయినా... జగన్ ఎన్ని పర్యటనలు చేయలేదు... రాష్ట్రంలో ఆయన తిరగని ప్రాంతం ఏదీ లేదు కదా అనుకోవాల్సిన అసవరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో జగన్ అన్ని జిల్లాలను, అన్ని ప్రాంతాలను కూడా చుట్టేశారు. అయితే నిన్న పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో జరిపిన పర్యటన ఆయనలోని జన నేతను మరోమారు ప్రపంచానికి చాటి చెప్పింది.
పశ్చిమ గోదావరి జిల్లా అంటే... అధికార టీడీపీకి కంచుకోట కిందే లెక్క. గడచిన ఎన్నికల్లో అక్కడి అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. జగన్ నేతృత్వంలోని వైసీపీ సింగిల్ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ఆళ్ల నాని లాంటి ప్రజాకర్షణ కలిగిన నేతలున్నా కూడా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అయినా కూడా ఆ జిల్లాను జగన్ దూరం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకేనేమో... మొన్నటి ఎమ్మెల్సీ సీట్ల విషయంలో తమ పార్టీ తరఫున జిల్లాకు ప్రాధాన్యమివ్వాలన్న ఉద్దేశ్యంతో ఆళ్ల నానికి ఎమ్మెల్సీగా ఛాన్సిచ్చారు. ఇక నిన్న గరగపర్రులో వైఎస్ జగన్ పర్యటన విషయానికి వస్తే... గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన నెలకొన్న వివాదంలో గ్రామం మొత్తం దళితులు - దళితేతరులుగా విడిపోయింది. ఓ ముగ్గురు వ్యక్తులు చేసిన అత్యుత్సాహం కారణంగా గ్రామం మొత్తం రెండుగా విడిపోయింది.
అయితే అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు ఈ విభేదాలను పరిష్కరించి గ్రామాన్ని ఐక్యం చేయాలన్న దిశగా సింగిల్ చర్య కూడా తీసుకున్న పాపాన పోలేదు. అంతేకాక ఎప్పటికప్పుడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేలా అటు రెవెన్యూ యంత్రాంగం - ఇటు పోలీసులు చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపించాయి. గ్రామంలో పరిస్థితి చక్కబడుతుందన్న క్రమంలో చర్చిలో నిద్రించిన ముగ్గురు దళిత నేతలను అరెస్ట్ చేయడంతో గ్రామంలో మళ్లీ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అయితే ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు కనబడలేదు. నిన్న గ్రామానికి వెళ్లిన జగన్... రెండు వర్గాలతో విడివిడిగా మాట్లాడారు. రెండు వర్గాల వారితోనే మమేకమైన జగన్... గ్రామంలో శాంతియుత పరిస్థితి ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఒకరిద్దరు చేసిన తప్పులకు గ్రామం రెండుగా విడిపోవడం భావ్యం కాదన్నారు. అది కూడా కులమతాల వారీగా విడిపోవడం అస్సలు బాగోలేదని చెప్పారు. తక్షణమే రెండు వర్గాలు కూడా కలిసిపోయి గ్రామ ఐక్యతను చాటి చెప్పాలని సూచించారు.
తన పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కలిగించినా... జగన్ మాత్రం వెనక్కు తగ్గలేదు. వేదిక ఏర్పాటుకు పోలీసులు ససేమిరా అంటే... జగన్ నేల మీదే కూర్చుని సమస్య పరిష్కారం కోసం శ్రమించారు. తొలుత దళితులు - ఆ తర్వాత దళితేతరులతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. గ్రామ ఐక్యత ఆవశ్యకతను వారికి అర్థమయ్యేలా చెప్పారు. ఈ సందర్భంగా రెండు వర్గాలతోనే జగన్ మమేకమైన తీరు నిజంగానే అందరినీ సంబ్రమాశ్యర్యాలకు గురి చేసింది. వర్గ విభేదాలతో ఉద్రిక్తంగా ఉన్న గ్రామంలో జగన్ పర్యటన మరింత ఆజ్యం పోస్తుందన్న కొందరి అనాలోచిత వ్యాఖ్యలను జగన్ తన పర్యటనతో పటాపంచలు చేశారు. రెండు వర్గాల వారు కూడా జగన్ చెప్పిన దానిని సావదానంగా ఆలకించడమే కాకుండా... జగన్ చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఆ గ్రామంలో జగన్ పర్యటనకు వ్యతిరేకంగా సింగిల్ నినాదం కూడా వినిపించకపోవడం ఇక్కడ గమనార్హం. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే టీడీపీ నేత అయినా.. జగన్, ఆయన వెంట వెళ్లిన ఆళ్ల నానితో గ్రామస్థులు కలగలసిపోయారు. జగన్ ఆప్యాయ పలకరింపునకు వారు కూడా అదే స్థాయిలో జగన్‌కు ఘన స్వాగతం పలికారు.
రాజకీయ లబ్ధి కోసం కాకుండా కేవలం గ్రామంలో నెలకొన్న సమస్య పరిష్కారం కోసమే తాను ఈ పర్యటన చేస్తున్నట్లు జగన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఇందులో భాగంగానే ఆయన టీడీపీపైనా, అక్కడ గతంలోనే పర్యటించిన ఇతర పార్టీలపైనా ఆయన సింగిల్ కామెంట్ కూడా చేయలేదు. వెరసి అసలు గ్రామంలోని ఇరు వర్గాల వారి మనసులను జగన్ గెలిచేశారు. ఇక సమస్య పరిష్కారం కోసం సర్కారు పటిష్ట చర్యలు చేపట్టాల్సి ఉండగా... చంద్రబాబు సర్కారు ఆ దిశగా సింగిల్ స్టెప్ కూడా వేయలేదనే చెప్పాలి. అయితే విపక్ష నేత హోదాలో ఉన్న జగన్... గ్రామంలో శాంతియుత వాతావరణం ఆవశ్యకతను నొక్కి చెప్పి.. సర్కారు చేయాల్సిన పనిని చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో జగన్ వ్యవహార సరళిని కీర్తిస్తూ నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్లు పోస్ట్ చేశారు. అంతేకాకుండా జగన్ పర్యటనకు సంబంధించిన వీడియోలను, గ్రామంలోని ఇరువర్గాల వారితో నేలపై కూర్చుని ఆయన జరిపిన చర్చలు, దళితులతో కలిసి ఆయన చేసిన భోజనం, ఇరు వర్గాలకు జగన్ సూచించిన సలహాల వీడియోలను కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో షేర్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/