Begin typing your search above and press return to search.

ఇళ్లు కట్టుకొనేందుకు 3 ఆప్షన్లు ఇచ్చిన జగన్​.. ఏ ఆప్షనైనా ఓకే!

By:  Tupaki Desk   |   28 Dec 2020 5:40 PM IST
ఇళ్లు కట్టుకొనేందుకు 3 ఆప్షన్లు ఇచ్చిన జగన్​..  ఏ ఆప్షనైనా ఓకే!
X
ఏపీ జగన్​మోహన్​రెడ్డి సోమవారం ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ అనే మరో పథకాన్ని ప్రారంభించారు. ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీప ఊరందూరులో ఆయన ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగన్​ పైలాన్​ను ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇళ్లు కట్టుకొనేందుకు పేద ప్రజలకు సీఎం జగన్​ మూడు ఆప్షన్లు ఇచ్చారు.

మొదటి ఆప్షన్‌లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించనుంది. రెండో ఆప్షన్‌లో ఇంటి పురోగతి ఆధారంగా డబ్బులు చెల్లించనున్నారు. మూడో ఆప్షన్లో పూర్తిగా ప్రభుత్వమే ఇళ్లను కట్టించి ఇవ్వనున్నది. ఈ మూడు పద్ధతుల్లో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోవచ్చని సీఎం జగన్​ పేర్కొన్నారు.
ఊరందూరు సభలో సీఎం జగన్​ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పండగరోజు. ఇళ్లులేని పేదల కళ్లలో చిరునవ్వు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నాం. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నాం. శ్రీకాళహస్తిలో రూ. 7 లక్షల విలువైన భూమి పట్టాలకు పేద మహిళలకు అందజేశాం’ అని జగన్​ పేర్కొన్నారు.

ఇళ్లస్థలాల పంపిణీలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడటం లేదని సీఎం జగన్ పేర్కొన్నారు. మరోవైపు ఇళ్లస్థలాల పంపిణీని అడ్డుకొనేందుకు ప్రతిపక్ష టీడీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. కోర్టుకెళ్లి ఈ ప్రక్రియను ఆపేందుకు స్కెచ్​ వేసిందని పేర్కొన్నారు. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు.. చంద్రబాబు తన మనుషులతో కోర్టులతో కేసులు వేయించారు. ఇక ఆ మనిషిని ఏమనాలి. గతంలోనూ పులివెందులలో ఇళ్లపట్టాలు ఇవ్వకుండా కోర్టుకెళ్లి ఆపారు.

అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. ‘సామాజిక సమతుల్యత’ అనే పేరుతో ఆపారు. ఇది నాకు చాలా చిత్రంగా అనిపించింది. రాజమండ్రిలో ఆవ భూముల పేరిట కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.