Begin typing your search above and press return to search.
జగన్ సంచలనం.. వీళ్లకు కేబినెట్ ర్యాంక్స్
By: Tupaki Desk | 2 Aug 2019 11:34 AM GMTఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనతో పాటు వైసీపీలో పనిచేసి ఇప్పుడు సామాజిక సమీకరణాల రీత్యా మంత్రి పదవులు దక్కని వారికి కేబినెట్ ర్యాంకులను కల్పించారు. ఇలాంటి హోదాను కల్పించడం చాలా అరుదు. కానీ జగన్ డేరింగ్ నిర్ణయం తీసుకొని వైసీపీ ఆశావహులను సంతృప్తి పరచడం విశేషం.
జగన్ కు సన్నిహితుడైన ఏపీ ప్రభుత్వ విప్.., రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి జగన్ కేబినెట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈయనతోపాటు ఆరుగిరికి సహాయ మంత్రులు స్థాయి హోదాను కల్పించడం విశేషం.
ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న శ్రీకాంత్ రెడ్డికి కేబినెట్ హోదా - విప్ లుగా ఉన్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి - ముత్యాలనాయుడు - దాడిశెట్టి రాజా - ఉదయభాను - రాంచంద్రారెడ్డి - శ్రీనివాసులకు సహాయ మంత్రి హోదా కేబినెట్ ర్యాంకు కల్పించారు. ఈ మేరకు మొత్తం ఒకరికి కేబినెట్ - ఆరుగురికి సహాయ మంత్రుల హోదా కల్పిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
చీఫ్ విప్ - విప్ లుగా ప్రభుత్వ పదవులను కేటాయించిన వారికి ఇలా కేబినెట్ ర్యాంకులు కల్పించడం వైసీపీ ఆశావహులను సంతృప్తి పరుస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం హోదాలను జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నాయి.