Begin typing your search above and press return to search.
మంత్రి అనిల్ కు క్లాస్ పీకిన సీఎం జగన్?!
By: Tupaki Desk | 6 Aug 2019 7:36 AM GMTపోలవరం వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కుటిల ప్రచారాన్ని తిప్పి కొట్టలేకపోయిన వైనంపై సాగునీటి వ్యవహారాల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి క్లాస్ పీకినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి ఇజ్రాయెల్ పర్యటనలో ఉండగా.. ఏపీలో పోలవరం ప్రాజెక్టు విషయంలో రచ్చ జరిగింది.
తెలుగుదేశం పార్టీ హయాంలో ఒప్పందం కుదిరిన కాంట్రాక్టు సంస్థలను తిప్పి పంపడంపై ఆ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. తెలుగుదేశం హయాంలో కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి కలిగిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. ఆ మేరకు కాంట్రాక్టర్లతో ఒప్పందాలను రద్దు చేసింది కొత్త ప్రభుత్వం.
తాము బేరం మాట్లాడి - కమిషన్లు కొట్టి - ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్లకు ఇలాంటి అనుభవం ఎదురుకావడంపై తెలుగుదేశం పార్టీ సహజంగానే మండి పడుతోందని వైఎస్సార్సీపీ వర్గాలు అంటున్నాయి. అయితే అలాంటి సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ధీటైన ప్రతిఘటన లేదు.
పోలవరం కాంట్రాక్టుల్లో చోటు చేసుకున్న అక్రమాల గురించి గట్టిగా మాట్లాడి - తెలుగుదేశం వాదనను తిప్పి కొట్టడలేదు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ బాధ్యత ప్రధానంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీదే ఉంది. అయితే టీడీపీ వాళ్లు వరస పెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నా అనిల్ కుమార్ మాత్రం మీడియా ముందుకు రాలేదు. ఆ అంశం మీద మాట్లాడలేదు. చివరకు ఎప్పుడో కానీ బయటకు రాలేదు.
ఈ అంశం మీద ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తను లేని సమయంలో అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత లేదా? అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ కు క్లాస్ పీకినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రచారం జరుగుతూ ఉండటం గమనార్హం.