Begin typing your search above and press return to search.
జగన్ వ్యూహం: కీలక నేతలకు ముఖ్య బాధ్యతలు
By: Tupaki Desk | 28 Oct 2017 5:27 PM GMTఏపీ విపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ తన వ్యూహానికి పదును పెట్టారు. 2019 ఎన్నికల్లో సీఎం పీఠం దక్కించుకుని పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న ఆయన ఆ దిశగా ఇప్పటికే పార్టీలో కొత్త రక్తం - కొత్త ఆలోచనలు - కొత్త నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. రెండు నెలల కిందట జరిగిన ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల హామీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్తున్నారు. అదేసమయంలో వైఎస్సార్ కుటుంబం పేరుతో అందరినీ తన వైపు తిప్పుకొనేందుకు చేసిన ప్రయత్నం ఇప్పటికే ఫలించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన మరో కీలక అడుగు వేశారు. ఎన్నికల్లో పార్టీని గెలుపు గుర్రం ఎక్కించగల నేతలకు ఏరికోరి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. తద్వారా పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు.. ప్రజలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలకు పదును పెట్టారు.
నిజానికి వచ్చే నెల 2 నుంచి జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ.. రాష్ట్రంలోని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా మరోసారి తెలుసుకోవడంతోపాటు అధికార టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కుట్ర పూరిత రాజకీయాలను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అదేసమయంలో పార్టీ పరంగా కూడా మంచి వాయిస్ ఉండాలని జగన్ భావించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నేతలకు పార్టీలో కీలక పదవులు అప్పగించడం ద్వారా మరింతగా లబ్ధి పొందాలని జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే రాజకీయ చైతన్యం ఉన్న కృష్ణా - అనంతపురం నేతలకు పార్టీలో కీలక పదవులు అప్పగించారు.
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో వివిధ పదవులకు కీలక నియామకాలు చేపట్టింది. ఈ మేరకు హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర ప్రధాన కార్యాలయం శనివారం ప్రకటనలు విడుదల చేసింది. రాష్ట్ర కార్యదర్శిగా చెల్లెం ఆనంద్ ప్రకాశ్(పాలకొల్లు నియోజక వర్గం ) నియమించినట్లు తెలిపింది. వీటితోపాటు ఎన్నారై విభాగం కేంద్ర కార్యాలయ సమన్వయకర్తగా గుంటూరుకు చెందిన అన్నపురెడ్డి హర్షవర్థన్ రెడ్డిని నియమించినట్లు తెలిపింది. అనంతపురం, కృష్ణా జిల్లాలకు చెందిన వారికి కీలక బాధ్యతలను అప్పజెప్పింది. మడకశిర నియోజకవర్గానికి గానూ రూరల్ మండల్ ప్రెసిడెంట్‌గా ఎస్ రామిరెడ్డిని నియమించినట్లు పేర్కొంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో స్పష్టం చేసింది. ఇక, దీంతో వైసీపీ దూకుడు మరింతగా పెరగనుందని లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.