Begin typing your search above and press return to search.
మంత్రులకు జగన్ గుడ్ న్యూస్... ?
By: Tupaki Desk | 8 Nov 2021 4:30 PM GMTవైసీపీ మంత్రులు ఇపుడు డోలాయమానంలో ఉన్నారు. ఒక విధంగా తాము అధికారంలో ఉన్నామన్న ఆనందాన్ని కూడా వారు అసలు ఫీల్ అవడంలేదు. 2021 రెండవ భాగం వస్తూనే మంత్రుల ముఖాలలో నవ్వుని మాయం చేసేసింది. ఇక తాము త్వరలోనే మాజీలం అవుతామన్న బాధతో ఆవేదనతో వారంతా ఉన్నారు. ఈ పరిణామాలతో వారు తాము చూసే శాఖల పట్ల కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నారు. ఎంతకాలం ఉంటామో తెలియదు, దాని కోసం అనవసరం హడావుడి చేసి బీపీ పెంచుకోవాల్సిన అవసరం ఏముదని కూడా వారు భావిస్తున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ మీద ఇప్పటిదాకా మీడియాలో వచ్చిన ఊహాగానాలే తప్ప అధికారికంగా ఎలాంటి సంకేతాలు అయితే లేవు. దాంతో మంత్రులలో కూడా దీని మీద చర్చ సాగుతోంది.
నిజంగా విస్తరణ ఉంటుందా. ఉంటే ఎపుడు ఉంటుంది. తమకు మరికొంత టైమ్ ఇస్తారా ఇలా సాగుతున్నాయి డిస్కషన్స్. ఈ నేపధ్యంలో మరో వార్త కూడా ఇపుడు చక్కర్లు కొడుతోంది. అది కూడా అనధికారమే అయినప్పటికీ కాస్తా ఆలోచిస్తే లాజిక్ తో కూడినది కావడంతో మంత్రులు దీన్ని గుడ్ న్యూస్ గానే భావిస్తున్నారు. ఆ వార్త ఏంటి అంటే మరో అయిదారు నెలల దాకా ప్రస్తుత మంత్రులను కదిపే సీన్ అయితే ఉండదు అని. అంటే 2022 ఏప్రిల్ తరువాత కానీ మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చు అన్నదే దాని సారాంశం.
మంత్రి వర్గ విస్తరణ గురించి ఇప్పటిదాకా ఎలాంటి కదలికలూ ఆలోచనలు కూడా హై కమాండ్ నుంచి లేకపోవడం ఈ వార్తకు బలాన్ని ఇస్తోంది. మరో వైపు 2022 బడ్జెట్ సమావేశాలను పూర్తి స్థాయిలో నిర్వహించాలని జగన్ డిసైడ్ అయ్యారుట. నిజానికి జగన్ అధికారంలోకి వచ్చాక బడ్జెట్ సమావేశాలు పూర్తిగా జరిగినది ఎపుడూ లేదు. 2019 మే 31న ఆయన సీఎం అయ్యారు. ఆ తరువాత ఒక బడ్జెట్ సమావేశం వెంటనే నిర్వహించారు. అది ఓటాను అకౌంట్ తరువాత మిగిలిన నెలలకు మాత్రమే సంబంధించింది.
ఇక 2020లో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు అనుకుంటే కరోనా వల్ల కొట్టుకుపోయింది. 2021లోనూ సేమ్ అలాగే జరిగింది. దాంతో 2022లో మాత్రం పక్కాగా నెల రోజుల పాటు బడ్జెట్ సెషన్ ని నిర్వహించి అన్ని శాఖల మీద సమీక్షతో పాటు ప్రభుత్వం అప్పటిదాకా చేసిన కార్యక్రమాలను కూడా సభకు తెలియచేస్తారుట. అలాగే కొత్త బడ్జెట్ ని ప్రవేశపెడతారుట. మరి పూర్తి స్థాయి బడ్జెట్ సెషన్ అంటే వివిధ శాఖలకు సంబంధించి గత రెండున్నరేళ్ళుగా పనిచేసిన మంత్రులు ఉంటేనే సభ సజావుగా సాగుతుంది అంటున్నారు. వారికే ఆయా శాఖల మీద పట్టుండడంతో పాటు అవగాహన కూడా ఉంటుందని, విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు గట్టిగా జవాబులు ఇవ్వగలరని భావిస్తున్నారుట. దాంతో బడ్జెట్ సెషన్ దాకా ఈ మంత్రులే కొనసాగుతారు అన్నది లేటెస్ట్ న్యూస్. అంటే 2022 మార్చి నెలాఖరు దాకా మంత్రి వర్గ విస్తరణ ఊసే ఉండదు అంటున్నారు. మరో అయిదారు నెలల దాకా ఈ మంత్రులదే దర్జా అని కూడా తెలుస్తోంది. ఒక విధంగా జగన్ మంత్రులకు చెప్పకనే చెబుతున్న గుడ్ న్యూస్ గానే దీన్ని తీసుకోవాలేమో.