Begin typing your search above and press return to search.

పింఛన్‌దారులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త!

By:  Tupaki Desk   |   13 Dec 2022 9:42 AM GMT
పింఛన్‌దారులకు జగన్‌ ప్రభుత్వం శుభవార్త!
X
ఆంధ్రప్రదేశ్‌ లో పింఛనుదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్‌ మొత్తాన్ని వచ్చే నెల నుంచి ప్రస్తుతం ఉన్న రూ.2500 నుంచి రూ.2750కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ అమలు కానుంది.

ఈ మేరకు డిసెంబర్‌ 13న సమావేశమైన ఏపీ కేబినెట్‌ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెన్షన్‌ పెంపుపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,500 పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్‌ పెంచింది.

కాగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 2000 రూపాయల పెన్షన్‌ ను దశలవారీగా రూ.3000కి పెంచుకుంటూ పోతామని తెలిపారు.

అందుకు తగ్గట్టే అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం 2020లో 2000 రూపాయలు ఉన్నగా పెన్షన్‌ను 2,250 చేశారు. ఆ తర్వాత దీన్ని 2021లో రూ.2,500 చేశారు. వచ్చే ఏడాది నుంచి రూ.2750 చేయనుంది.

మరొకవైపు వైఎస్సార్‌ పశుబీమా పథకం ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వర్చువల్‌ క్లాస్‌లు, ఫౌండేషన్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీ రూమ్‌లను నాడు–నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.

ప్రధానంలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పెన్షన్‌ లబ్ధిదారులపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. మొత్తం 61 లక్షల మందికి ప్రతి నెలా 1నే పెన్షన్‌ అందేలా చేస్తోంది. వలంటీర్లు ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే బయోమెట్రిక్‌ తీసుకుని పెన్షన్‌ అందజేస్తోంది. ఈ నేపథ్యంలో వీరంతా వచ్చే ఎన్నికల్లో గంపగుత్తగా తమకు ఓట్లేస్తారని వైసీపీ భారీ ఆశలే పెట్టుకుంది.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇస్తున్న రూ.2500 పెన్షన్‌ను రూ.2750కి పెంచుతూ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.