Begin typing your search above and press return to search.

జగన్ సర్కారు సక్సెస్.. పెట్టుబడుల సాధనలో దేశంలోనే టాప్ 2 ప్లేస్

By:  Tupaki Desk   |   17 Jan 2021 4:30 AM GMT
జగన్ సర్కారు సక్సెస్.. పెట్టుబడుల సాధనలో దేశంలోనే టాప్ 2 ప్లేస్
X
దేశంలో అత్యంత ఆదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ చేసిన అధ్యయనంలో జగన్ కున్న ప్రజాభిమానం ఎంతన్న విషయం మరోసారి స్పష్టమైంది. ఇదిలా ఉంటే.. జగన్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలిచే ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చేసింది. అదేమంటే.. అక్టోబరు - డిసెంబరుతో ముగిసే మూడో త్రైమాసికంలో దేశంలోనే అత్యధిక పెట్టుబడుల్ని ఆకర్షించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది.

నిత్యం ఏదో ఒక రాజకీయ రగడ ఏపీలో కనిపిస్తుందన్న మాట తరచూ వినిపిస్తున్న వేళ.. రాజకీయ కుట్రల్ని తట్టుకుంటూనే.. పాలనా పరంగా తన ముద్రను జగన్ వేశారని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించటం అంత తేలికైన విషయం కాదు. అందుకు భిన్నంగా మిగిలిన రాష్ట్రాలు విసిరే గట్టి పోటీని తట్టుకొని మరీ.. దేశంలోనే టాప్ సెకండ్ ప్లేస్ ను సొంతం చేసుకున్నారు.

ముగిసిన మూడు నెలల వ్యవధిలో మహారాష్ట్ర రూ.54,714 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించి టాప్ ప్లేస్ లో నిలిస్తే.. రెండో సథానంలో ఏపీ నిలిచింది. పెట్టుబడుల సాధనలో గుజరాత్.. తమిళనాడు.. ఒడిశా.. కర్ణాటక రాష్ట్రాల కంటే కూడా ఏపీ ముందు స్థానంలో నిలవటం విశేషం. మూడు నెలల వ్యవధిలో రూ.29,784 కోట్ల పెట్టుబడుల్ని తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. పెట్టుబడుల సాధనలో గుజరాత్.. తమిళనాడు ఏపీ కంటే వెనుకబడి ఉండటం విశేషం.

అహ్మదాబాద్.. సూరత్ లాంటి నగరాలు ఉన్న గుజరాత్ ను.. చెన్నై లాంటి మెట్రో సిటీ ఉన్న తమిళనాడును వదిలేసి.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు రావటం ఆసక్తికరమని చెప్పాలి. నిజానికి ఏపీలో విశాఖ మినహా సరైన నగరమే లేదు. అయినప్పటికీ.. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని సొంతం చేసుకోవటం చూస్తే.. కచ్ఛితంగా జగన్ సమర్ధతే ఇందుకు కారణమని చెప్పక తప్పదు.