Begin typing your search above and press return to search.

ఏలూరు బాధితులకు జగన్ సర్కార్ అండ

By:  Tupaki Desk   |   6 Dec 2020 11:43 AM GMT
ఏలూరు బాధితులకు జగన్ సర్కార్ అండ
X
సృహ తప్పి.. కళ్లు తిరిగి నిన్న రాత్రి ఏలూరు వాసులు పెద్ద ఎత్తున ఆస్పత్రిపాలైన సంగతి తెలిసిందే. దాదాపు 100 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.

తాజాగా అస్వస్థతకు గురైన ఏలూరు బాధతులను డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. వార్డులో ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇప్పటివరకు అస్వస్థతకు గురై 277 మంది చికిత్స పొందుతున్నారని.. ఇంకా మూర్చ, వాంతులు వంటి బాధితులు పెరుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వీరు చేరారని.. ఇప్పటివరకు 70మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76మంది స్త్రీలు, 46మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు.

మెరుగైన చికిత్స కోసం కొందరిని విజయవాడకు తరలించామని.. సీఎం జగన్ స్వయంగా సమీక్షిస్తున్నాడని మంత్రి తెలిపారు. పరిస్థితి చక్కబడే ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. బాధితుల నుంచి రక్తనమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపామని వైరస్ లక్షణాలు లేవని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.