Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్.. లక్ష జరిమానా

By:  Tupaki Desk   |   23 Sept 2021 8:00 PM IST
జగన్ సర్కార్ కు సుప్రీంకోర్టు షాక్.. లక్ష జరిమానా
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుమార్లు కోర్టుల ఆగ్రహానికి గురైన ఏపీ ప్రభుత్వానికి తాజాగా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. లక్ష రూపాయల జరిమానా విధించింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు సుప్రీంకోర్టు ఈ జరిమానా విధించింది.

దేవీ సీఫుడ్స్ లిమిటెడ్ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా ధిక్కరణ మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది.దీనిపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా లక్ష జరిమానా విధించింది. అయితే కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం ఏపీ ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోయింది.

భారతదేశంలో ఇప్పటివరకు మరో ప్రభుత్వానికి తగలని ఎదురుదెబ్బలు ఏపీ సర్కార్ కు తగులుతున్నాయి. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏదో కేసులో షాక్ లు తప్పడం లేదు. నిన్ననే టీటీడీ పాలకమండలి నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. అంతకుముందు అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లోనూ ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ పథకాలు, పేదల ఇళ్ల పంపకాల విషయంలో పలు మార్పులు కోర్టు చేత తిరస్కరాలు ఎదురయ్యాయి. ఐఏఎస్ అధికారులకు శిక్షలు, జరిమానాలు పడుతున్నాయి. తాజాగా కూడా లక్ష జరిమానా విధించడం సంచలనమైంది.