Begin typing your search above and press return to search.
పేస్ మాస్కులపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం... ఏంటంటే ?
By: Tupaki Desk | 12 July 2021 10:40 AM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ ఇంకా కొనసాగుతుంది. మొదటి వేవ్, ఆ తర్వాత కొన్ని రోజులకే సెకండ్ వేవ్ , ఇప్పుడు సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందిలే అనుకునే సమయంలోనే మూడో వేవ్ ముప్పు మళ్లీ దాడికి సిద్ధమైంది. కరోనా మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ లు, ఆంక్షలు అమలు చేసారు. ఇంకా కొనసాగిస్తున్నారు. దేశంలో లాక్ డౌన్ నియమాల నుండి సడలింపులు ఇస్తున్నారు. కర్ఫ్యూ మాత్రమే కొనసాగిస్తున్నారు. ఇక కరోనా మహమ్మరి కట్టడికి మన దగ్గరున్న ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. వ్యాక్సిన్ తీసుకుంటేనే కరోనా నుండి రక్షణ అని నిపుణులు చెప్తున్నారు.
ఇకపోతే, కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది కాబట్టి లాక్ డౌన్ నియమాలు సడలించిన కూడా కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గలేదు. కాబట్టి కరోనా నియమాలు తప్పక పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్ లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్ లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్ కమిటీలు మాస్క్ లు ధరించేలా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. అన్నిజిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకూ సడలింపులు ఇచ్చారు. రాత్రి 9 గంటలకల్లా దుకాణాల మూసివేత, 10 గంటల తర్వాత అమల్లోకి కర్ఫ్యూ ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.