Begin typing your search above and press return to search.

జగన్ గ్రాఫ్ బాగా తగ్గింది...ఈ సర్వే ఎవరిదంటే..?

By:  Tupaki Desk   |   14 Feb 2022 10:52 AM GMT
జగన్ గ్రాఫ్ బాగా తగ్గింది...ఈ సర్వే ఎవరిదంటే..?
X
ఏపీలో జగన్ కి ఇప్పటికిపుడు ప్రజాదరణ ఎలా ఉంది అన్న ప్రశ్న ఎంతో ఆసక్తికరం. దానికి జవాబు కోసం అంతే ఇంటెరెస్ట్ గా చెవులు రిక్కించి వినే వారు ఉన్నారు. ఇక ఏపీలో వైసీపీ బలంగా ఉంది అని సొంత పార్టీ వారు చెప్పుకోవడం కామన్. మేము అన్ని రకాలైన సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతామని వైసీపీ నేతలు ఒక్కలెక్కన బాకా ఊదుతారు.

అయితే టీడీపీ నేతలు మాత్రం ఏపీలో జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది అంటున్నారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితే ఏపీలో జగన్ కి ప్రజాదరణ బాగా తగ్గిందని, దాని స్థానంలో జగన్ పాలన మీద పూర్తి వ్యతిరేకత వచ్చిందని కూడా నిర్ధారించారు.

జగన్ మీద ప్రజాలలో మునుపటి మోజు అయితే లేదు అని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. వైసీపీ నవరత్నాలు అన్నారు. ఎన్నికల ప్రణాళికలో చెప్పిన హామీలు అమలు చేశామని అన్నారు. కానీ ఏవీ నెరవేర్చని చరిత్ర జగన్ సర్కార్ ది అని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీలో జనాలు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని, వారు తమ గోడు చెప్పుకోవడానికి టీడీపీని ఆశ్రయిస్తున్నారని కూడా ఈ యువ ఎంపీ చెప్పారు.

ఇక జగన్ హింసించే రాజు పులకేసి మాదిరిగా పాలన చేస్తున్నారు అని రామ్మోహన్ నాయుడు సెటైర్లు వేశారు. టాలీవుడ్ లో సమస్యలు సృష్టించిందే జగన్ అని, తిరిగి వాటికి పరిష్కరించినట్లుగా చెప్పుకుంటూ సినిమా హీరోల చేత పొగిడించుకున్నారని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఒక విధంగా చెప్పాలీ అంటే టాలీవుడ్ హీరోల కంటే కూడా జగన్ బ్రహ్మాండంగా నటిస్తున్నారు అని కూడా రామ్మోహన్ నాయుడు అనడం విశేషం. జగన్ నటన చూసి టోటల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీయే పెద్ద దండం పెడుతోంది అంటే ఇక ఆ నటన తీరు చెప్పతరమా అని కూడా రామ్మోహన్ నాయుడు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాల మీద వైసీపీ ఎంపీలు అసలు పోరాడేది లేదు, ఇక ఏపీకి తీరని అన్యాయం చేస్తున్నా మోడీ మీద పల్లెత్తు మాట అనడానికి కూడా జగన్ ఎందుకు ఆలోచిస్తున్నారు అని నిలదీశారు. ఒక వైపు స్టాలిన్, కేసీయార్, మమతా బెనర్జీ వంటి వారు కేంద్రం మీద పోరాడుతూంటే జగన్ మాత్రం మౌనంగా ఉన్నారని దుయ్యబెట్టారు. మొత్తానికి చూస్తే ఈ టీడీపీ యువ ఎంపీ ఒక్క మాటలో తేల్చేసింది ఏంటంటే ఏపీలో జగన్ కి ప్రజాదరణ బాగా తగ్గిందని, గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, మరి దీని మీద వైసీపీ నేతలు ఏమంటారో, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.