Begin typing your search above and press return to search.
జగన్ గ్రాఫ్ లెగుస్తుంది బాబు ది పడిపోతుంది!?
By: Tupaki Desk | 8 March 2019 1:30 AM GMTఏపీ రాజకీయ పరిణామాలు అత్యంత ఆసక్తిదాయకంగా మారుతూ ఉన్నాయి. అటు డేటా చౌర్యం, ఇటు ఓట్ల తొలగింపు వ్యవహారం సంచలనంగా మారుతూ ఉంది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తగులుతుంది. ఇన్ని రోజులూ పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుగా తెలుగుదేశం పార్టీ ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఆఖరికి తెలుగుదేశం వాళ్లు తమ ఓటు హక్కు జోలికి - తమ డేటా జోలికి వచ్చే సరికి తెలుగుదేశం పార్టీ పై జనాల్లో కొత్త అనుమానాలు రేగుతూ ఉన్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎంతగా గగ్గోలు పెడుతోందో తెలిసిన అంశమే. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో ఎదురుదాడి చేసినా… ప్రజలు అయితే నమ్మే పరిస్థితి లేదు.
ఎందుకంటే తెలుగుదేశం ఇక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడిపోయింది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అసలు గుట్టును బయటపెట్టింది. ఇక ఇతర రాజకీయ పరిణామాలు కూడా తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ గానే మారాయి.
ఈ నేపథ్యంలో.. తెలుగుదేశం గ్రాఫ్ చాలా వరకూ కుంగిపోతోందని సమాచారం. ఏకంగా మూడు శాతం ఓటు బ్యాంకును తెలుగుదేశం పార్టీ కోల్సోయిందని సమచారం. వారం రోజుల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ ఈ మేరకు నష్టపోయిందని.. పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ హైక్ చోటు చేసుకుందని.. జగన్ వైపు మూడు శాతం ఓటు బ్యాంకు పెరిగిందని విశ్లేషిస్తున్నారు క్షేత్ర స్థాయి పరిశీలకులు. ఎన్నికల ముందు డేటా చౌర్యం వ్యవహారం బయటపడటం తెలుగుదేశం పార్టీకి పెను కుదుపుగా మారుతూ ఉంది.
అప్పటికే చంద్రబాబు నాయుడు ఓటు షేర్ ముప్పై ఆరు శాతానికి పడిపోయిందన్నారు. జగన్ ఓటు షేర్ దాదాపు నలభై ఐదు వరకూ కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో మరో మూడు శాతం లాస్ కావడం అంటే.. తెలుగుదేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో తగిలేది గట్టి దెబ్బే అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.