Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఆ సెంటిమెంట్ వ‌దిలేశార్రా!

By:  Tupaki Desk   |   10 July 2022 2:30 AM GMT
జ‌గ‌న్ ఆ సెంటిమెంట్ వ‌దిలేశార్రా!
X
అమ్మ‌ను మించిన దైవం లేదు.. అవును అంతా ఈ న‌మ్మ‌కంతోనే ఉంటారు. జ‌గ‌న్ కూడా ఉన్నారు.. కానీ గౌర‌వాధ్య‌క్ష ప‌ద‌వికి మాత్రం అమ్మ వ‌ద్ద‌ని అంటున్నారు. ఎందుకంటే కుటుంబంలో వ‌చ్చిన త‌గాదాలే ఇందుకు ఓ కార‌ణం కావొచ్చు అని అంటున్న‌ది  ఓ వ‌ర్గం. గ‌త ఏడాది నవంబ‌ర్ నుంచి న‌లుగుతున్న ఇష్యూ ఇది. అంతేకాదు బాబాయ్ కుటుంబంతో కూడా రాజీ జ‌రుగుతున్న‌ది అని తెలుస్తోంది. అంటే త‌గాదాలు అన్నీ ప‌రిష్కారం చేసుకున్నాకే నిన్న‌టి వేళ ఒ క్క‌టిగా రాజ‌న్న ఘాట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చారా? అంటే ఔన‌న్న స‌మాధాన‌మే ఓ వ‌ర్గం నుంచి  బ‌లీయంగా వినిపిస్తోంది. ప్ర‌ధాన మీడియా కూడా ఇదే చెబుతోంది.


మ‌ద‌ర్ సెంటిమెంట్ ను వ‌దిలేయ‌డం అంత ఈజీ కాదు. కాదు కానీ ఆయ‌న వ‌ద్ద‌నుకుంటున్నారు. వీలున్నంత మేర‌కు త‌న ప్రాబ‌ల్యం అన్న‌ది పెంచుకునే క్ర‌మంలోనే ఆయ‌న ఉన్నారు అన్న మాట కూడా విన‌వ‌స్తోంది. తండ్రి వైఎస్సార్ ఛార్మింగ్ తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా కూడా ఇప్పుడా హ‌వాను కొన‌సాగించే క‌న్నా త‌నంత‌ట తాను మ‌రింత బ‌ల‌ప‌డేందుకు ఇష్ట‌ప‌డే నేత‌గా ముద్ర వేయించుకునే తాప‌త్ర‌యంలో ఉన్నారు జ‌గ‌న్.

ఒక‌ప్పుడు ఏ ప‌ని చేసినా అమ్మ విజ‌య‌మ్మ ఆశీస్సుల‌తోనే మొద‌లు పె ట్టేవారు. కానీ ఇప్పుడు త‌న పంథా మార్చుకుంటున్నారు. కేవ‌లం నాన్న‌కు నివాళి చెప్పి త‌రువాత త‌న ప‌ని తాను చేసుకుని పోతున్నారు. అస‌లు పార్టీనే నిల‌బెట్టింది విజ‌య‌మ్మ అని అంటారు. పార్టీని బ‌తికించిందే షర్మిల‌మ్మ అని కూడా అంటారు. మ‌రి ఆ ఇద్ద‌రు స్త్రీ మూర్తుల‌ను కూడా వ‌దిలి రాజ‌కీయం చేయాల‌నుకుంటున్నారు.దీనివల్ల వైసీపీ పొందే ల‌బ్ధి ఏంట‌న్న‌ది అంద‌రినీ వేధిస్తున్న స‌మస్య.

పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలిగా తాను ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నానని చెప్పిన‌ప్పుడు కార్య‌క‌ర్త‌లంతా వ‌ద్దు వ‌ద్దు అంటూ గ‌ట్టిగా అరిచారు కూడా !  అయితే తాను తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ఎవ్వరికీ ఏ న‌ష్టం ఉండ‌దు అని త‌న మ‌ద్ద‌తు ఇద్ద‌రు బిడ్డ‌ల‌కూ ఉంటుంద‌ని అన్నారు ఆమె. కానీ జ‌గ‌న్ మ‌ద‌ర్ సెంటిమెంట్ ను వ‌దిలి రాజ‌కీయం చేయాల‌నుకోవ‌డం సాహ‌స‌మే అని చెప్పాలి.

ఎందుకంటే ఆ రోజు పార్టీని బ‌తికించింది.. ఇంటింటికి పోయి పార్టీని బ‌తికించండి అని వేడుకున్న‌ది విజ‌య‌మ్మ మాత్రమే! జైల్లో జ‌గ‌న్ ఉన్న‌ప్పుడు కూడా ఆ పార్టీ ప్రణాళిక‌ల‌న్నింటినీ ముందు ఉండి న‌డిపారు. అలాంటిది ఇప్పుడాయ‌న పార్టీ నుంచి ఆమెను త‌ప్పించిన వైనంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే ఎప్ప‌టి నుంచో ఉన్న కుటుంబ క‌ల‌హాల కార‌ణంగానే విజ‌య‌మ్మ వైసీపీని వీడేందుకు ఇష్ట‌ప‌డ్డారు అన్న వాద‌న ఉంది.

వాస్త‌వానికి గ‌త ఏడాది జ‌రిగిన వైఎస్సార్ వ‌ర్ధంతి స‌భ‌లోనే (ష‌ర్మిల నిర్వ‌హించారు  ఈ వేడుక.. హైద్రాబాద్ కేంద్రంగా) విజ‌య‌మ్మ ఎంతో న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడారు. జ‌గ‌న్ బాగానే ప‌నిచేస్తున్నాడ‌ని, ఇక్క‌డ అంటే తెలంగాణ‌లో రాజ‌శేఖర్ రెడ్డి ఆశ‌యాల‌కు అనుగుణంగా త‌న బిడ్డ పార్టీ న‌డ‌పాల్సి ఉంద‌ని చెబుతూ ఆ రోజు చెప్పారు. మ‌ళ్లీ ఇప్పుడు అదే మాట చెప్పి..త‌న‌కున్న విభిన్న ప‌రిస్థితుల‌ను త‌ల్చుకుని కన్నీటి ప‌ర్యంతం అయ్యారు.