Begin typing your search above and press return to search.

అధికార‌మే కాదు.. అంత‌కుమించి.. జ‌గ‌న్ ల‌క్ష్యాలు ఇవే

By:  Tupaki Desk   |   1 Aug 2022 4:09 AM GMT
అధికార‌మే కాదు.. అంత‌కుమించి.. జ‌గ‌న్ ల‌క్ష్యాలు ఇవే
X
వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల కు సంబంధించి బాగానే ప్లాన్ చేసుకున్నారు. అధికారంలోకి రావ‌డ‌మే కాదు.. అంత‌కు మించి.. అనే రేంజ్‌లో ఆయ‌న వ్యూహాలు రెడీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్ని అవ‌రోధాల‌నైనా అధిగ‌మించి.. మ‌రోసారి అధికారంలోకి రావ‌డం.. అనేది జ‌గ‌న్ కీల‌క ల‌క్ష్యంగా ఉంది. ఈ ఒక్క‌సారి ఆయ‌న అధికారం ద‌క్కించుకుంటే.. త‌దుప‌రి సంవ‌త్స‌రాలు.. తేలిక‌గా విజ‌యం ద‌క్కించుకోవ‌చ్చ‌ని .. ఆయ‌న భావిస్తున్న‌ట్టు ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతోంది.

దీనికి సంబంధించి.. ఆయ‌న ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ప్ర‌తి ఒక్క‌రినీ ముందుకు న‌డిపిస్తున్నారు. హెచ్చ‌రిస్తున్నారు. టికెట్లు కావాలంటే.. ముందుకు న‌డ‌వాల్సిందేన‌ని చెబుతున్నారు. ఇక‌, తాను కూడా త్వ‌రలోనే జిల్లాల యాత్ర చేయ‌నున్నారు. ఫ‌లితంగా.. ఆయ‌న ప్ర‌జ‌ల నాయ‌కుడిగా గుర్తింపు పొందేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, మ‌రో ముఖ్య ల‌క్ష్యం.. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయ‌డం. అంటే.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఓడిస్తే.. చాలు.. ఇక‌, బ‌ల‌మైన గ‌ళం లేకుండా పోతుంద‌నేది వైసీపీ అధినేత వ్యూహం కావొచ్చు.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్ అడుగులు, నిర్ణ‌యాలు ఆస‌క్తిగా మారాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుంటున్నారు. అయితే.. ఇక్క‌డ ఆయ‌న‌ను ఓడించాలి. అదేవిధంగా మంగ‌ళ‌గిరిలో ఆయ‌న కుమారుడు నారా లోకేష్‌కు మ‌రోసారి షాకివ్వాలి.. ఇదీ.. మ‌రో ప్ర‌ధాన లక్ష్యంగా ఉన్న‌ద‌ని అంటున్నారు.

అందుకే వైసీపీలో కీలక నాయ‌కు లు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును గెల‌వ‌మ‌నండి చూద్దాం! అని త‌ర‌చుగా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అంటే.. దీని వెనుక చాలా వ్యూహాత్మ‌కంగానే.. వైసీపీ అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎన్నిక‌ల‌కు రెండేళ్ల స‌మ‌యం ఉంద‌నగానే `ఆప‌రేష‌న్ కుప్పం` చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌గా భ‌ర‌త్ ను నియ‌మించారు. మ‌రోవైపు పార్టీని కుప్పంలో గెలిపించే బాధ్య‌త‌ను సీనియ‌ర్ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఆయ‌న కుమా రుడు.. మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డ‌ప్ప‌కు అప్ప‌గించారు. ఇప్ప‌టికే స్థానిక ఎన్నిక‌ల్లో కుప్పాన్ని వైసీపీ కైవ‌సం చేసుకుంది. ఈ జోష్ మ‌రింత కొన‌సాగాల‌ని.. వైసీపీ అధినేత కోరుకుంటున్నారు.

మ‌రోవైపు.. వ‌చ్చే నెల‌లో ప్ర‌జాద‌ర్బార్ ప్రారంభిచ‌నున్నార‌ని సీఎంవో వ‌ర్గాలు చెబుతున్నాయి. అంటే.. ప్ర‌జ‌ల‌తో నేరుగా జ‌గ‌న్ ముఖాముఖి స‌మ‌స్య‌లు విని.. వాటి ప‌రిష్కారానికి కృషి చేయ‌నున్నారు. అంటే.. ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతున్నార‌నే వాద‌న‌ను జ‌గ‌న్‌.. మ‌రో రూపంలో తిప్పికొట్టే ప్ర‌యత్నం చేయ‌డంతోపాటు.. ``నేను ఉన్నాను`` అనే బ‌ల‌మైన సంకేతాల‌ను మ‌రోసారి పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా.. చెప్పాలంటే.. రాబోయే ఏడాదిన్న‌ర పాటు.. జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌తోనే ఉంటారన్న‌మాట‌.