Begin typing your search above and press return to search.
జగన్ అంతే.. ప్రచారం చేసుకోడు పని చేస్తాడు
By: Tupaki Desk | 2 May 2018 4:45 AM GMTపావలా చేస్తే రూపాయి పావలా చేసుకున్నట్లు చెప్పుకునే రోజులివి. నోరు తెరిస్తే అధినాయకులు తాముఎంత గొప్పవాళ్లమో.. తామెన్ని గొప్ప పనులు చేశామో అదే పనిగా చెప్పుకోవటం కనిపిస్తుంటుంది. మంచి చేసే అవకాశం వచ్చినప్పుడు.. గుట్టుగా చేసేయటం.. దాన్నో ప్రచారాంశంగా మార్చకోని వైనం ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది. సాయం చేయమని తన దగ్గరకు వచ్చే వారి విషయంలో ఆయనెంతగా స్పందిస్తారనటానికి తాజా ఉదంతమే ఒక నిదర్శనం.
ఒక పేద దంపతులు తమకు తాముగా ప్రజా సంకల్ప యాత్రకు రావటం.. జగన్ కారణంగా తమ కుటుంబానికి జరిగిన మేలును చెప్పటంతో కానీ.. ఆయన చేసిన పని బయటకు రాలేదు. విన్నంతనే కదిలించే ఈ ఉదంతంలోకి వెళ్లినప్పుడు.. తన తండ్రి వైఎస్ మాదిరి సాయం కావాలన్నా అని అడగటమే తరువాయి.. సాయానికి సిద్ధమయ్యే తత్త్వం జగన్ లో నిండుగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని కందుకూరు గ్రామానికి చెందిన అశోక్.. స్రవంతి దంపతులు తాజాగా జగన్ ను కలిశారు. తమకు చేసిన మేలును ఈ జీవితంలో మర్చిపోలేమని చెప్పుకున్నారు. ఇంతకీ వారికి జగన్ చేసిన సాయం ఏమిటంటే.. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కొడుకు ఆదిత్యకు చిన్నతనం నుంచే వినికిడి లోపం. మాటలు రాని దుస్థితి. దీంతో.. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించాలని భావించారు. కానీ.. అందలేదు. ఆరేళ్లు గడిచిన తర్వాత వైద్యుల్ని మరోసారి సంప్రదిస్తే.. మాటలు రావటానికి చేసే ఆపరేషన్ కు రూ.9లక్షలు అవసరమవుతాయని వైద్యులు చెప్పారు. అంత ఖర్చు భరించలేని అశోక్ దంపతులు ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నించారు. కానీ.. సాధ్యం కాలేదు.
ఇదే సమయంలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్ కందుకూరు రావటం.. ఆయన్ను కలిసిన అశోక్ దంపతులు తమ వేదనను చెప్పుకున్నారు. వీరి ఆవేదనను విన్నంతనే స్పందించిన జగన్.. ఆ చిన్నారిని ఆసుపత్రిలో చూపించి వైద్యం చేయించాలని తన చిన్నాన్న కొడుకు వైఎస్ కొండారెడ్డిని ఆదేశించారు.
వెంటనే స్పందించిన ఆయన.. ఆదిత్యను హైదరాబాద్ తీసుకెళ్లి అపోలోలో చూపించారు. వినికిడి సమస్యను తీర్చేందుకు రూ.9లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించారు. శస్త్రచికిత్స సక్సెస్ కావటం.. మాట్లాడటం కోసం ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. తమకు చేసిన సాయానికి జగన్ కు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు పాదయాత్రలో ఉన్న జగన్ ను కలిశారు. దీంతో.. ఆయన చేసిన సాయం బయటకు వచ్చింది.