Begin typing your search above and press return to search.
అదిరేలా జగన్ ఐడియా..ఫాలో అవుతారా సారూ?
By: Tupaki Desk | 25 March 2020 4:42 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కరోనా కారణంగా ఏదైనా ముప్పు ఉందంటే.. అది కేవలం విదేశాల నుంచి వచ్చిన వారు.. వారికి అత్యంత దగ్గరగా ఉంటున్న వారేనని చెప్పాలి. మరి.. ఫారిన్ నుంచి వచ్చినోళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా ఉన్నారు. మార్చి ఒకటో తేదీని కటాప్ గా పెట్టుకుంటే.. దాదాపు గడిచిన 20 రోజుల్లో విదేశాల నుంచి వచ్చినోళ్ల లెక్క పక్కాగా తేల్చటం.. వారిలో కరోనా లక్షణాలతో ఉన్న వారిని వేరు చేయటం ద్వారా.. వైరస్ ముప్పును చాలావరకూ తగ్గించే అవకాశం ఉంది.
అయితే.. అదేమీ అంత చిన్న పని కాదు. అందుకోసం చాలానే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ఏపీలో 20 వేలకు పైనే.. తెలంగాణలో 16వేలకు పైనే విదేశాల నుంచి వచ్చినోళ్లు ఉంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఎయిర్ లైన్స్ సంస్థలతో పాటు.. పలు శాఖల నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే.. విదేశాల నుంచి వచ్చిన వారు.. ఇప్పుడెక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది గుర్తించటంలోనే అసలు సమస్య ఉంది.
విదేశాల నుంచి వచ్చి.. కరోనా లక్షణాలు కనిపించే వారు ఎవరెవరిని కాంటాక్టు అయ్యారన్నది అన్నింటికి మించిన పెద్ద సమస్య. కరోనా వ్యాప్తి రెండో దశకు వెళ్లేందుకు.. ఆ వెంటనే మూడు దశలోకి అడుగు పెట్టేందుకు అవకాశం ఉన్న ఈ విపరిణామాన్ని అర్జెంటుగా ఆపేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చినోళ్లు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అధికారికంగా తమ దగ్గరున్న డేటాను సరిపోల్చేలా వారి ప్రయత్నం ఉండటం గమనార్హం.
ఏపీ వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి.. సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం వాలంటీర్లు.. ఏఎన్ ఎంలు.. ఆశా వర్కర్లతో సర్వే చేయించనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లటం.. అందులో విదేశాల నుంచి వచ్చిన వారు ఎంతమంది అన్నది లెక్క తేలుస్తారు. అదే సమయంలో.. కరోనా లక్షణాలు ఎవరిలోనైనా కనిపిస్తున్నాయా? అన్నది ఆరా తీస్తారు. తాముచేస్తున్న సర్వే డేటాను విశ్లేషించి మరిన్ని చర్యలు చేపట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాల నుంచి వచ్చిన వారి లెక్క పక్కాగా తేలితే.. చాలా అంశాలపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. మరి.. ఇదే వ్యూహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాలో అవుతారా? అన్నది చూడాలి.