Begin typing your search above and press return to search.

ప్రతీ పింఛన్ కు రూ.50 వసూలు.?

By:  Tupaki Desk   |   4 Aug 2019 8:02 AM GMT
ప్రతీ పింఛన్ కు రూ.50 వసూలు.?
X
వృద్ధులు - వికలాంగులు - ఒంటరి మహిళలకు పంచే పింఛన్లలో చోటుచేసుకుంటున్న అవినీతి కథలు సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతున్నాయి.. ప్రత్యర్థి టీడీపీ దీన్ని పనిగట్టుకొని ఎండగడుతూ వైరల్ చేస్తోంది. బాధితులు కూడా ఇందులో నిజాలను బయటపెడుతుండడంతో అవీనీతి బాగోతాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత వైఖరి కూడా ఇలాంటివి జరగడానికి దోహదపడుతున్నాయంటున్నారు.

తాజాగా నెల్లూరు జిల్లాలో పింఛన్లు కాజేసిన వైనంపై స్థానికులు మండిపడుతున్నారు. కావాలి మున్సిపల్ ఉద్యోగి స్థానంలో ప్రభుత్వ పింఛన్లు ఇస్తున్న వ్యక్తులు ప్రతీ పింఛన్ కు 50 రూపాయలు వసూలు చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారట.. ఇందులో 18వార్డు వైసీపీ నాయకులు కూడా ఉండడంపై వారు మండిపడ్డట్టు తెలిసింది. పింఛన్ డబ్బులు వసూలు చేసిన ముగ్గురు వైసీపీ నాయకులను స్థానికులు నిలదీసినట్టు సమాచారం.

ఇక ఇప్పటికే పులివెందుల - నగరి గుట్టల్లో ముసలివాళ్ల కళ్లు గప్పి పింఛన్లు పంచడంలో అధికారులు చేతివాటం ప్రదర్శించారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కావాలిలో అధికారులను పక్కనపెట్టి వృద్ధుల పింఛన్లలో రూ.50 చొప్పున నేతలు నొక్కేసిన వైనం బయటకు రావడం కలకలం రేపుతోంది.

ఓ వైపు జగన్ అవినీతి రహిత పాలన అందించాలని పట్టుదలతో ముందుకు వెళుతుంటే క్షేత్రస్థాయిలోని వైసీపీ నేతలు మాత్రం పింఛన్లలో చేతివాటం ప్రదర్శించడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోంది.