Begin typing your search above and press return to search.
జగన్ దీక్ష : డేట్ - ప్లేస్ డిసైడయింది
By: Tupaki Desk | 30 Sep 2015 8:43 AM GMTఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టబోయే దీక్షా వేదిక ఎట్టకేలకు ఖరారైంది. గతంలో గుంటూరులో జగన్ చేపట్టాలనుకున్న దీక్షకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. దీనిపై కోర్టును లంచ్ మోషన్ రూపంలో సంప్రదించినా ఫలితం విఫలమయింది. మరోమారు హైకోర్టును వెళ్లి అదే వేదిక కోసం పట్టుబట్టకుండా ఉండాలని భావించారు. దీంతో గుంటూరులోనే ఐదు ప్రాంతాలను ఎంపిక చేసుకొని పోలీసుల అనుమతిని కోరారు.
తుది చర్చల తర్వాత అక్టోబర్ 7న గుంటూరు జిల్లా నల్లపాడులో జగన్ దీక్ష చేపట్టనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఈ సభా వేదిక నిర్ణయంపై ఇప్పటికే పోలీసులు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారని సమాచారం. పాత వేదిక కోసం పట్టుబట్టకుండా దీక్ష వేదిక మార్చుకోవడంతో పోలీసులు నల్లపాడులో దీక్ష నిర్వహించుకునేందుకు సూచన ప్రాయంగా అంగీకారం తెలిపారని వైసీపీ శ్రేణులు వివరించాయి. అయితే గతంలో వలే ఈ దీక్ష తేదీ స్థలం ఫైనల్ అయినట్లేనా? లేదా వైసీపీ మార్కు మార్పుల్లో భాగంగా మళ్లీ చేంజ్ ఉంటుందా అనేది చూడాలి మరి.