Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ షో రెండురోజులే..లైట్ తీసుకోండిః జ‌గ‌న్

By:  Tupaki Desk   |   12 Dec 2017 7:03 AM GMT
ప‌వ‌న్ షో రెండురోజులే..లైట్ తీసుకోండిః జ‌గ‌న్
X
ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన పార్టీ అధినేత - సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుడిగాలి ప‌ర్య‌ట‌న ప‌లు వ‌ర్గాల‌ను ఆక‌ర్షించిన సంగ‌తి తెలిసిందే. త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా వివిధ వ‌ర్గాల‌తో స‌మావేశ‌మైన ప‌వ‌న్ ఈ క్ర‌మంలో కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించారు. దీంతో పాటుగా వైసీపీఅధినేత - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డిపై విరుచుకుప‌డ్డారు. ప‌వ‌న్ దూకుడుపై ప‌లువురు ఆశ్య‌ర్యం వ్య‌క్తం చేశారు కూడా! ఇంత‌కీ ఈ ప‌రిణామాన్ని విప‌క్ష వైసీపీ ఎలా చూసింది అనేది అంద‌రిలోనూ ఆసక్తిని రేకెత్తించే అంశం.

వైసీపీ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం...వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి `లైట్` తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని పార్టీ నేత‌ల‌తో కూడా ఆయ‌న వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ నేత‌ల‌తో జ‌రిగిన అంత‌ర్గ‌త స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్ట్ టైం రాజ‌కీయ‌వేత్త అని వివ‌రించిన వైఎస్ జ‌గ‌న్‌...ఆయ‌న గురించి పెద్ద‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదన్న‌ట్లు తెలుస్తోంది. త‌న‌కు తోచిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు వ‌ద్ద‌కు వెళ్లి...రెండుమూడు రోజుల పాటు షో చేసే ప‌వ‌న్ గురించి సీరియ‌స్‌ గా ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని జ‌గ‌న్‌ వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం.

రాష్ట్రంలోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌ని - వాటిని ప‌రిష్క‌రించేందుకు త‌గు కృషి చేయాల‌ని పార్టీ నేత‌ల‌కు ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ సూచించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటే వారు త‌ప్ప‌క ఆద‌రిస్తార‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా పార్టీ ఎంపీలు పార్ల‌మెంటు స‌మావేశాల్లో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాటం చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ పిలుపునిచ్చారు. ఏపీకి కీల‌మైన ప్ర‌త్యేక హోదా - పోల‌వ‌రం నిర్మాణం - ప్ర‌త్యేక రైల్వే జోన్ స‌హా కీల‌క‌మైన ఇత‌ర హామీల‌ను నిలుపుకొనేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా వైసీపీ ఎంపీలు కృషి చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ సూచించారు.