Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ నిర్ణ‌యం... టీడీపీకి కోలుకోలేని దెబ్బే!

By:  Tupaki Desk   |   25 May 2018 9:10 AM GMT
జ‌గ‌న్ నిర్ణ‌యం... టీడీపీకి కోలుకోలేని దెబ్బే!
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో రాష్ట్రంలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ త‌న‌దైన శైలి దూకుడును ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాపై ఆది నుంచి ఒకే స్టాండ్‌ తో ముందుకు సాగుతున్న వైసీపీ... ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిత్యం వ‌ల్లించే మాట త‌ప్పం - మ‌డ‌మ తిప్ప‌మ‌న్న రీతిలోనే ప‌య‌నిస్తోంద‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. అస‌లు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదాతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యంపై జ‌నానికి అవ‌గాహ‌న క‌లిగించేందుకు జ‌గ‌న్ ఏకంగా యువ‌భేరీల పేరిట ప్ర‌త్యేక స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించారు. అంతేకాకుండా హోదా కోసం ఏకంగా నిరాహార దీక్ష‌ల‌కు దిగిన ఘ‌న‌త కూడా జ‌గ‌న్‌ దేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ నేప‌థ్యంలో కేంద్ర బ‌డ్జెట్ లో ఏపీకి కేటాయింపులేమీ లేని వైనంపై భ‌గ్గుమ‌న్న వైసీపీ... సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఏపీ ప‌ట్ల న‌రేంద్ర మోదీ స‌ర్కారు చూపిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా ఏకంగా త‌మ ఎంపీల‌తో రాజీనామాలు చేయిస్తామంటూ వైసీపీ ప్ర‌క‌టించింది. పార్టీ అధినేత మాటే శిరోధార్యంగా ముందుకు సాగుతున్న వైసీపీ ఎంపీలు... త‌మ ప‌ద‌వుల‌ను త్య‌జించే విష‌యంలో ఏమాత్రం వెనుకంజ వేయ‌లేద‌నే చెప్పాలి. ఇంకా ఏడాది పాటు ఎంపీలుగా ఉండే అవ‌కాశ‌మున్నా... రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసేశారు. అంతేకాకుండా మాట మార్చే పార్టీల ఎంపీల మాదిరిగా ఆ రాజీనామాలు కూడా ఏదో అల్లాట‌ప్పాగా కాకుండా ప‌క‌డ్బందీగా స్పీక‌ర్ ఫార్మాట్ లో చేసేశారు. వైసీపీ కొట్టిన ఈ దెబ్బ‌కు నిజంగానే అధికార పార్టీ టీడీపీ విల‌విల్లాడిపోయింద‌న్న విశ్లేష‌ణ‌లు కూడా లేక‌పోలేదు.

వైసీపీ ఎంపీల రాజీనామాల ప్ర‌క‌ట‌న‌తోనే నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అంట‌కాగిన టీడీపీ అప్ప‌టిక‌ప్పుడు ఆ పార్టీతో పొత్తు క‌టీఫ్ చెప్ప‌క త‌ప్ప‌లేదు. మొత్తంగా వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు ఏపీలో ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయానికి తెర తీయ‌డ‌మే కాకుండా... విశ్వ‌స‌నీయ రాజ‌కీయాలు చేసేదెవ‌ర‌న్న విష‌యంపై కీల‌క చ‌ర్చ‌కు తెర తీశాయ‌ని చెప్పాలి. అయితే వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను ఇప్ప‌టిదాకా లోక్ స‌భ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఆమోదించ‌లేదు. స్పీక‌ర్ ఫార్మాట్లో చేసిన స‌ద‌రు రాజీనామాల‌ను వెన‌క్కు తీసుకోవాల‌ని - రాజీనామాలు స‌రికాద‌ని కూడా సుమిత్రా వైసీపీ ఎంపీలకు సూచించారు. అయితే త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌మ‌కు ముఖ్య‌మ‌ని - త‌మ‌కు ప‌ద‌వులేమీ అంత ముఖ్యం కాద‌ని కూడా వారు తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో మ‌రోమారు సుమిత్రా మ‌హాజ‌న్ నుంచి రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీల‌కు పిలుపు వ‌చ్చింది. ఈ నెల 29న త‌న‌ను క‌ల‌వాల‌ని ఆమె వైసీపీ ఎంపీల‌కు లేఖ‌లు రాశారు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీలు పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ఇప్ప‌టికే ప‌లుమార్లు చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. మ‌రోమారు కూడా రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలు జ‌గ‌న్‌ తో కీల‌క భేటీ కానున్నారు.

ఈ విష‌యంలో ఇప్ప‌టికే క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గానే ఉన్న జ‌గ‌న్‌... చేసిన రాజీనామాల‌ను ఆమోదింప‌జేసుకునే బాధ్య‌త కూడా మీదేన‌ని ఎంపీల‌కు తేల్చి చెప్పిన‌ట్లు స‌మాచారం. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల ముందు మ‌న‌కు ప‌ద‌వులు ఎంత అన్న కోణంలో సూచ‌న‌లు చేసిన జ‌గ‌న్‌.. రాజీనామాల‌ను ఆమోదింప‌జేసుకుని తిరిగి రావాల‌ని వారికి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా రాజీనామాల‌ను ఆమోదింప‌జేసుకున్న త‌ర్వాతే ఢిల్లీ నుంచి రాష్ట్రానికి రావాల‌ని, వ‌చ్చీ రాగానే నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర‌ల‌కు శ్రీ‌కారం చుట్టాల‌ని కూడా జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్ర‌మంలోనే నిన్న మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్ బాబాయి - ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి... రాజీనామాల‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. 29న జ‌రిగే భేటీలో త‌మ రాజీనామాల‌ను ఆమోదించాల‌ని స్పీక‌ర్‌ పై ఒత్తిడి చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. ఏమాత్రం స్వ‌లాభం కోసం ఆశించ‌కుండా రాష్ట్ర ప్రయోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీల రాజీనామాల‌ను స్పీక‌ర్ కూడా ఆమోదించ‌క త‌ప్ప‌దన్న వాద‌న కూడా వినిపిస్తోంది.

ఇదే జ‌రిగితే...వైసీపీ ఎంపీల రాజీనామాల‌తో ఖాళీ అయ్యే ఐదు లోక్ స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌నిస‌రి. ఈ విష‌యంపైనా పూర్తి స్ప‌ష్ట‌త ఉన్న వైసీపీ... ఉప ఎన్నిక‌ల‌కు కూడా సిద్ధ‌మైపోయింద‌న్న కోణంలో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎంపీల రాజీనామాల‌కు ఆమోదం ల‌భించి, వారి స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగితే మాత్రం... ఏపీలో అధికార పార్టీ టీడీపీకి కోలుకోలేని దెబ్బ త‌ప్ప‌ద‌న్న వాద‌న కూడా ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. హోదాపై ఎప్ప‌టిక‌ప్పుడు మాట మార్చేసిన టీడీపీ... ఈ ఉప ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజ‌యం పాల‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మ‌రో ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో... వైసీపీ ఎంపీల రాజీనామాల‌తో ఖాళీ అయ్యే స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగితే.... టీడీపీ కొంప కొల్లేర‌యిన‌ట్టేన‌న్న వాద‌న వినిపిస్తోంది. మొత్తంగా ప్ర‌త్యేక హోదాపై స్ప‌ష్ట‌మైన వైఖ‌రితో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌... ప‌క‌డ్బందీ వ్యూహంతో టీడీపీని చావు దెబ్బ కొట్టేయ‌నున్నార‌న్న క‌థ‌నాలూ వినిపిస్తున్నాయి. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?