Begin typing your search above and press return to search.
హోదాపై ప్రవాసాంధ్రులతో జగన్ లైవ్ షో!
By: Tupaki Desk | 24 Sep 2016 10:10 AM GMTఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్యాకేజీ ప్రకటించేసి కేంద్రం చేతులు దులిపేసుకుంది. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రాలో అభివృద్ధి సాధ్యం అని గతంలో ప్రచారం చేసిన భాజపా, తెదేపాలు ఇప్పుడు మాట మార్చేశాయి. అంతేకాదు, ప్రత్యేక హోదాను పదేళ్లపాటు కోరిన భాజపా నేత వెంకయ్య నాయుడు, ఇప్పుడు కేంద్రమంత్రి హోదాలో ఏపీలో పర్యటిస్తూ ప్యాకేజీ గొప్పతనాన్ని వివరిస్తున్నారు! ఇచ్చినమాటను నిలబెట్టుకోలేని భాజపా, కేంద్రాన్ని ప్రశ్నించే తెగువలేని దేశం తీరుపై ఆంధ్రాలో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రత్యేకహోదా సాధన దిశగా ప్రతిపక్షం వైకాపా అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది.
ప్యాకేజీ ప్రకటనను నరిసిస్తూ రాష్ట్ర బంద్ నిర్వహించింది. మొన్ననే ఏలూరులో యువభేరి కార్యక్రమాన్ని వైకాపా అధినేత జగన్ నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధన దిశగా పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసే దిశగా అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకుంటూ ముందుకు సాగేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రవాసాంధ్రుల మద్దతు కూడగట్టేందుకు జగన్ సిద్ధమౌతున్నారు. ప్రవాసాంధ్రులకు ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. రేపు, అంటే సెప్టెంబర్ 25 (ఆదివారం)న హైదరాబాద్‌లోని వైకాపా కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ఉంటుంది.
భారత కాలమాన ప్రకారం ఈ కార్యక్రమం రేపు రాత్రి 8 గం. 30 ని.కి ప్రారంభం అవుతుంది. వివిధ దేశాల్లోని ప్రవాసాంధ్రులకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కింద ఉన్న యూట్యూబ్ లింక్ క్లిక్ చేయడం ద్వారా జగన్ వీడియో కాన్ఫరెన్స్ లైవ్ వీక్షించవచ్చు.
క్లిక్ చేయండి