Begin typing your search above and press return to search.
జనంలోకి జగన్.. రెండు కారణాలు..!
By: Tupaki Desk | 20 Sep 2022 12:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత.. జగన్ జనంలోకి వచ్చి.. మూడేళ్లు దాటిపోయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఆయన ఎక్కడా ప్రజల్లో లేరనేది తెలిసిందే.అయితే.. ఆయన సర్కారు ప్రారంభించిన తర్వాత.. అనూహ్యంగా కరోనా మహమ్మారి చుట్టుముట్టింది. దీంతో రెండేళ్లు ఎవరూ ఎవరినీ కలుసుకునే పరిస్థితి లేకుండా.. పోయింది. ఇక, ఆ తర్వాత.. ప్రజల మధ్యకువ స్తున్నా.. కేవలం కార్యక్రమాల ప్రారం భం కోసం..బటన్ నొక్కడం కోసమే.. జగన్ పరిమితం అవుతున్నారు.
ఈ నేపథ్యంలో జనం మధ్య జగన్ లేరనే వాదనను ప్రతిపక్షాలు బలంగా తీసుకువెళ్లాయి. అయినా..కూడా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. దీనిని సాధారణ ప్రచారం మాదిరిగానే ఆయన భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆయన ప్రజల్లోకి రాకుండా..
ఉండలేని అనివార్యమైన పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. దీనికి ప్రదానంగా రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి.. ప్రతిపక్ష నాయకులు.. పాదయాత్ర, బస్సు యాత్ర పేరుతో ప్రజల మధ్యకు వచ్చేస్తున్నారు.
టీడీపీ యువ నాయకుడు.. మాజీ మంత్రి నారా లోకేష్.. త్వరలోనే పాదయాత్ర కు రెడీ అవుతున్నారు. ఇక, జనసేన అధ్యక్షుడు.. పవర్ స్టార్ పవన్ కూడా.. దసరా రోజు నుంచే బస్సు యాత్రకు సిద్ధమవుతు న్నారు. ఈ రెండు యాత్రలకు కూడా.. మంచి క్రేజ్ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు వివరించాలనే లక్ష్యం.. వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలనే భారీ టార్గెట్‌తోనే ఈ ఇద్దరు నాయకులు యాత్రకు రెడీ అయ్యారు.
మరో కీలక కారణం.. తన ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని.. అప్పులు ఎక్కువగా చేస్తున్నార ని ప్రజలను నమ్మిస్తున్నారని.. స్వయంగా జగన్ భావించడమే. ఈ రెండు కారణాలపై.. ఇప్పటికిప్పుడు తను స్పందించకపోతే..
పెద్ద నష్టం జరిగిపోవడం ఖాయమని..జగన్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనేఆయన అత్యంత వేగంగా.. త్వరలోనే ప్రజలను కలిసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఖాయమని అంటున్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ఆయన తనదైన శైలిలో చెక్ పెట్టడం కూడా ఖాయమని చెబుతున్నారు. సో.. ఈ రెండు కారణాలతో జగన్.. జనంలోకి రావడంఖాయంగా కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.