Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ డేరింగ్..నామినేటెడ్ లోనూ రిజ‌ర్వేష‌న్లు

By:  Tupaki Desk   |   7 Jun 2019 7:49 AM GMT
జ‌గ‌న్ డేరింగ్..నామినేటెడ్ లోనూ రిజ‌ర్వేష‌న్లు
X
నవ్యాంధ్ర‌ప్ర‌దేశ్ కు నూత‌న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ఏ ఒక్క‌రి ఊహ‌కే అంద‌నంత‌గా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో తాను అధికారంలోకి వ‌స్తే.... త‌న తండ్రి - దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అందించిన మాదిరిగా సంక్షేమ పాల‌న‌కు శ్రీ‌కారం చుడ‌తాన‌ని - రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌... అందుకు అనుగుణంగా సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. 25 మంది మంత్రుల‌తో తన కేబినెట్ ను ఫుల్ ప్లెడ్జ్ గానే ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. అందులో ఐదుగురికి డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ఇవ్వ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు.

ఆ ఐదు ప‌ద‌వులు కూడా ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ - కాపు సామాజిక వ‌ర్గాల‌కు కేటాయించ‌నున్న‌ట్లుగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాకుండా త‌న కేబినెట్ లోని మంత్రి ప‌ద‌వుల్లో 50 శాతం మేర ప‌దవులు బ‌డుగు - బ‌ల‌హీన వ‌ర్గాల‌కే కేటాయించ‌నున్న‌ట్లు కూడా జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. మొత్తంగా త‌న పాల‌న‌లో ఏ ఒక్క వ‌ర్గాన్ని గానీ, ఏ ఒక్క సామాజిక వ‌ర్గాన్ని గానీ నిర్ల‌క్ష్యం చేసే స‌మ‌స్యే లేద‌ని జ‌గ‌న్ తేల్చేశారు. ఇక నామినేటెడ్ ప‌ద‌వుల కేటాయింపులోనూ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తాన‌ని చెప్పి జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

విద్య‌, ఉపాధి అవ‌కాశాల్లో రిజ‌ర్వేష‌న్లు ప‌క్కాగా అమ‌లు చేయ‌డ‌మే గ‌గ‌న‌మ‌వుతున్న వేళ‌... మంత్రి ప‌ద‌వులు - చివ‌ర‌కు నామినేడెట్ ప‌ద‌వుల కేటాయింపులోనూ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌నున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం నిజంగానే సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. ఈ లెక్క‌న రాష్ట్రంలో ఇక‌పై భ‌ర్తీ చేయ‌నున్న అన్ని నామినేడెట్ ప‌ద‌వుల్లో స‌గానికి స‌గం సీట్లు రిజ‌ర్వేష‌న్ కేట‌గిరీల‌కు ద‌క్క‌నున్నాయి. అంతే.... అభివృద్ధి చెందిన సామాజిక వ‌ర్గాల‌తో స‌మానంగా రిజ‌ర్వ్‌ డ్ కేట‌గిరీల‌కు చెందిన వారు కూడా ఎదగ‌డం ఖాయ‌మేన‌న్న మాట‌. అయినా పార్టీ ప‌ద‌వులు - మంత్రి ప‌ద‌వుల విష‌యంలో రిజ‌ర్వేష‌న్ల అమ‌లు అనే మాటే వినిపించ‌ని ప్ర‌స్తుత త‌రుణంలో చివ‌ర‌కు నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీలోనూ రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌డం నిజంగానే సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి.