Begin typing your search above and press return to search.

బాబుకు ఫోన్ చేసి మ‌రీ జ‌గ‌న్ ఇన్విటేష‌న్!

By:  Tupaki Desk   |   28 May 2019 8:25 AM GMT
బాబుకు ఫోన్ చేసి మ‌రీ జ‌గ‌న్ ఇన్విటేష‌న్!
X
ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఏపీకి కాబోయే కొత్త ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఫోన్ చేశారు. ఈ నెల 30న తాను ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ఫోన్ చేసి.. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

త‌న‌కు జ‌గ‌న్ నేరుగా ఫోన్ చేసిన నేప‌థ్యంలో బాబు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ముఖ్య‌మంత్రి కానున్న వేళ.. జ‌గ‌న్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. జ‌గ‌న్ ఇన్విటేష‌న్ కు బాబు రెస్పాన్స్ కు ఎలా ఉంద‌న్న విష‌యంపై స‌మాచారం బ‌య‌ట‌కు రాలేదు.

ఇటీవ‌ల వెలువ‌డిన ఎన్నిక‌ల ఫ‌లితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల‌తో బంప‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌టం తెలిసిందే. త‌న ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను.. ప్ర‌ధాని మోడీని.. ఇత‌ర ప్ర‌ముఖుల్ని ఆహ్వానించారు. ఆ క్ర‌మంలో మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఆహ్వానించారు. మ‌రి.. జ‌గ‌న్ పిలుపు నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి వెళ‌తారా? అన్న‌దిప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.