Begin typing your search above and press return to search.

బాబుని కోరి మరీ పిలుస్తున్న జగన్... ?

By:  Tupaki Desk   |   5 Feb 2022 2:30 AM GMT
బాబుని కోరి మరీ పిలుస్తున్న జగన్... ?
X
ఏపీలో రాజకీయాలు చూస్తే అటు చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా ఉన్నారు. ఆయన ప్రధాన భూమికలో లేని ఏపీ రాజకీయాన్నిగత పాతికేళ్ళలో రాష్ట్రం చూసి ఎరగదు. బాబు రాజకీయాల్లో అలా తనదైన బలమైన ముద్ర వేశారు. ఇదిలా ఉంటే జగన్ సర్కార్ అధికారంలోకి రావడం అసెంబ్లీలో టీడీపీకి మెజారిటీ దారుణంగా పడిపోవడంతో బాబు విపక్ష నేతగా ఆదిలోనే సభకు రారు అనుకున్నారు. ఆయన సభకు నమస్కారం అనడానికి రెండేళ్ల టైమ్ పట్టింది.

అసెంబ్లీలో పెద్దాయన మీద వైసీపీ ఎమ్మెల్యేలు అనుచితంగా మాట్లాడారు అన్న దాని మీద అలిగి ఆయన బాయ్ కాట్ అనేశారు. ఇదంతా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరిగిన ముచ్చట. ఇక ఇపుడు చూడబోతే నాలుగైదు నెలలు గడచాయి. ఎన్నో సమస్యలు ఈ మధ్య కాలంలో అలా తోసుకువచ్చేశాయి. అన్నింటికీ మించి నాటికీ నేటికీ కూడా ఏపీలో రాజకీయ చిత్రం త్వరగా మారిపోతోంది.

దాంతో ఏపీలో ఈసారి జరిగే బడ్జెట్ సమావేశాలు వాడిగా వేడిగా ఉండబోతున్నాయి. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో బడ్జెట్ సెషన్ కి ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే సభకు బాయ్ కాట్ చేసిన చంద్రబాబు అసెంబ్లీ వైపు చూస్తారా లేదా అన్నదే చర్చగా ఉంది. అయితే చంద్రబాబు సభకు రావాల్సిన అవసరం అయితే ఉంది అనే అంటున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబు ఒకక్రే సభకు రానని చెప్పారా. లేక ఏకమొత్తంగా టీడీపీ వారే రారా అన్న డౌట్ కూడా ఉంది. అయితే బాబు రాకుండా ఎమ్మెల్యేలు వచ్చినా పెద్దగా మైలేజ్ టీడీపీకి రాదు అంటున్నారు. ఏపీలో పెరిగిపోతున్న సమస్యలతో పాటు అనేక ముఖ్యమైన అంశాలు చర్చించాలీ అంటే చంద్రబాబు అసెంబ్లీకి తప్పకుండా రావాల్సి ఉంటుందని అంటున్నారు.

చంద్రబాబు అసెంబ్లీకి వస్తే చాలా విషయల్లో జగన్ సర్కార్ ని పూర్తిగా కార్నర్ చేయవచ్చు అని కూడా టీడీపీలో చర్చ సాగుతోంది. ఇక కొత్త జిల్లాలతో పాటు, ఏపీలో అభివృద్ధి లేమి, అనేక ప్రజా సమస్యలు, కొండలా పేరుకుపోతున్న అప్పులు వంటివి అన్నీ కూడా సభలో ప్రస్థావనకు వస్తాయని అంటున్నారు. మొత్తానికి ఏపీలో పొలిటికల్ సీన్ అయితే మారింది. సమస్యల మీద సమస్యలు పెరుగుతున్నాయి. బాబుని సభకు వచ్చేలా చేయడంలో ఈ విధంగా జగన్ సర్కార్ చాలానే చేస్తోంది అంటున్నారు. బాబు సభకు రావడం ద్వారా రాజకీయంగా ఈ అంశాలన్నీ వాడుకుంటే వైసీపీకి ఇరకాటం తప్పదు అంతే.