Begin typing your search above and press return to search.
జగన్ నైతిక విలువలు ఉన్న వ్యక్తి: జేసీ ప్రభాకర్ రెడ్డి!
By: Tupaki Desk | 18 March 2021 9:48 AM GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైతిక విలువలు కూడిన వ్యక్తి అని తాజాగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన తండ్రి వైఎస్ లాగానే, ఆయనలో కూడా విలువలు ఉన్నాయని, ఆ విషయాన్ని తాను ఈరోజు స్పష్టంగా గమనించినట్లు తెలిపారు.
సీఎం జగన్ సహకారం లేకపోతే తాను ఈ రోజు మున్సిపల్ చైర్మన్ అయ్యి ఉండేవాన్ని కాదంటూ జగన్ ను ప్రశంసలతో ముంచెత్తారు అతి త్వరలో సీఎం జగన్‌ని కలుస్తానని, తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య తో కలిసి పనిచేస్తానని తెలిపారు. సీఎం జగన్ పై నిన్న మొన్నటి వరకు కయ్యానికి కాలుదువ్విన జేసీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంతో అందరూ కొంచెం షాక్ కి గురైయ్యారు. ఇది నిజంగానే ఊహించని పరిణామం.
మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సత్తా చాటినా... తాడిపత్రిలో మాత్రం జేసీ సోదరులు తమ ముద్ర వేశారు. తెలుగుదేశం పార్టీకి అతీతంగా తమ సొంత ప్రాబల్యంతో మున్సిపల్ చైర్మన్ పదవిని సొంతం చేసుకున్నారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. తాడిపత్రిలో అటు జేసీ ఫ్యామిలీ, ఇటు పెద్దారెడ్డి కుటుంబాల మధ్య హైటెన్షన్ వాతావరణం నడిచిన సంగతి తెలిసిందే. సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా జరిగాయి.
అయితే అనూహ్యం జేసీ కుటుంబం ఆధిపత్యం ప్రదర్శించింది. ఇక్కడ మొత్తం వార్డులు 36 కాగా. టీడీపీ 18 వార్డుల్లో … వైసీపీ 16 వార్డుల్లో గెలిచాయి. సీపీఐ ఒక స్థానం.. ఇండిపెండెంట్ మరో స్థానం కైవసం చేసుకున్నాయి. ఎంపీ తలారి రంగయ్య , ఎమ్మెల్సే పెద్దారెడ్డి ఎక్స్ అఫిషియో ఓట్లతో వైసీపీ బలం 18కి చేరింది. గెలిచిన 18 మందితోపాటు సీపీఐ, స్వతంత్రుల మద్దతుతో టీడీపీ ఇక్కడ పాగా వేసింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈ మున్సిపాలిటీని దక్కించుకునేందుకు వైసీపీ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదనే చెప్పాలి. వైసీపీ కూడా ఇక్కడ పాగా వేయాలని భావిస్తే సీన్ వేరేలా ఉండేదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారిన మైదుకూరు మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.