Begin typing your search above and press return to search.
చంద్రబాబు కంటే జగన్ వేయి రెట్లు బెటర్: కేఏ పాల్ హాట్ కామెంట్స్!
By: Tupaki Desk | 3 Jan 2023 10:41 AM GMTప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మత ప్రబోధకుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కంటే జగన్ వేయిరెట్లు బెటర్ అని వ్యాఖ్యానించారు. జగన్ తన సలహాలను పాటిస్తాడని ప్రశంసించారు. చంద్రబాబు సభల్లో తొక్కిసలాటల వల్లనే సభలు, సమావేశాలకు ప్రభుత్వం నిబంధనలు పెట్టిందని కేఏ పాల్ అన్నారు. ప్రస్తుతం చంద్రబాబుకి ఏమి చెయ్యాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
ఇక, ఏపీ అభివృద్ధి కోసం జగన్ తనను పిలిపించి మాట్లాడతారేమో చూస్తానని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తన పాస్ పోర్టు పెట్టుకోండి.. లక్ష కోట్ల రూపాయలు తెస్తాను అన్నారు.
ప్రధాని.. కేంద్ర హోం మంత్రి తన సలహాలు తీసుకుంటున్నారని కేఏ పాల్ తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు కేంద్రానికి వచ్చేలా చేశానన్నారు. ప్రధానికంటే జగన్ గొప్పవారా..? అని ప్రశ్నించారు. జగన్ తనను పిలిచి సలహాలు ఎందుకు తీసుకోరు..? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎలాగూ బుద్ది లేదు.. జగన్కేమైంది అని నిలదీశారు. డియర్ కేఏ పాల్ అని లేఖ రాస్తే చాలు.. పూర్తిగా సహకరిస్తాను అని ప్రకటించారు.
ఎన్ఆర్ఐల వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లగా మార్చడానికే చంద్రబాబు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాడంటూ కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు చంద్రబాబుతో ఉన్న వారందరినీ తాను శపిస్తున్నానని.. చంద్రబాబుతో ఉన్నవారందరి జీవితాలు నాశనం అయిపోతాయని కేఏ పాల్ శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబు దృష్టిలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు అంటే బిచ్చగాళ్లా అని పాల్ ప్రశ్నించారు.
తాను చంద్రబాబు సహా ఎంతో మందిని సీఎంగా చేశానని కేఏ పాల్ గుర్తు చేసుకున్నారు. అసలు కేసిఆర్ కు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టే హక్కు లేదని పాల్ హాట్ కామెంట్స్ చేశారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ అమ్ముడు పోయారని చంద్రశేఖర్ కుమారుడు తనకు చెప్పారని పాల్ చెప్పడం విశేషం.
కందుకూరు, గుంటూరు సభల్లో జరిగిన రెండు దుర్ఘటనలపై నేడు హైకోర్టులో విచారణ జరగనుందని తెలిపారు. తమకు రాజ్యాధికారం కావాలన్నారు. మాల, మాదిగలను విడగొట్టింది చంద్రబాబేనని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరిరామ జోగయ్యకు ఈ వయసులో ధర్నాలు. దీక్షలు ఎందుకని ప్రశ్నించారు రిజర్వేషన్, రాజ్యాధికారం కావాలంటే తనతో కలిసి రావాలని కోరారు. అప్పుడు అందరం కలిసి కలిసి పోరాడదామంటూ పిలుపునిచ్చారు. ఏపీలో 2023లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో త్వరలో చూస్తారని పాల్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. చంద్రబాబుకు దూరంగా జరగాలని పాల్ కోరారు. ఇక, వర్ల రామయ్య మంచోడే.. కానీ అడుక్కు తింటున్నాడన్నారు. సార్.. సార్ అంటూ అడుక్కోవడం దేనికి వర్ల రామయ్య.. అని ప్రశ్నించారు. వర్ల రామయ్య పోటీ చేసి ఓడిపోతే వంద కోట్ల ఇస్తాను అని ప్రకటించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.