Begin typing your search above and press return to search.
పక్కన పెట్టేసి ఢిల్లీకి పంపిన ప్రవీణ్ ను మళ్లీ తెచ్చేస్తున్న జగన్?
By: Tupaki Desk | 26 Aug 2022 12:30 PM GMTఏమైనా చేయగలిగిన ముఖ్యమంత్రులు కొందరు ఉంటారు.ఆ కోవలోకే వస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏ సందర్భంలో ఏం చేస్తారన్న విషయంలో సన్నిహితులకు సైతం అర్థం కాకుండా వ్యవహరించే విషయంలో ఆయనకు ఆయనే సాటిగా చెబుతుంటారు.
కొంతకాలం క్రితం ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ ఏపీ సీఎంవోలో ఎంతలా హవా నడిపించారో తెలియంది కాదు. తర్వాతేమైందో తెలీదు కానీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆయన్ను సీఎంవో ముఖ్య కార్యదర్శి హోదా నుంచి తప్పించి.. ఢిల్లీకి పంపేశారు.
ఏపీ సర్కారులో ఒక వెలుగు వెలిగి.. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా.. ఆయన చేత ఏ పనైనా చేయించగలిగిన సత్తా ఉన్న అధికారిగా ఆయనకు పేరుంది. అలాంటి ఆయన్ను మళ్లీ రాష్ట్రానికి తిరిగి పంపనున్నారు.
దీని కోసం ప్రవీణ్ గట్టిగా ప్రయత్నాలు చేయటం.. సీఎం జగన్ ను నేరుగా అడిగేసిన ఆయన.. తాను అనుకున్నది సాధించినట్లుగా చెబుతున్నారు. ఆరున్నర నెలలు ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పని చేస్తున్నారు. ఫిబ్రవరి 14న పోస్టు తొలగించి.. ఢిల్లీకి పంపిన ఆయన ఆర్నెల్లు తిరిగేసరికి మళ్లీ అమరావతికి వచ్చే ప్రయత్నాలు ముమ్మురం అయినట్లు చెబుతారు.
తాజాగా తిరిగి వస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ కు ఏపీ సీఎంవోలో సాధారణ పరిపాలన శాఖలో పెద్ద పీట వేస్తారని చెబుతున్నారు. పలు అంశాల్లో ఆయన వ్యవహారశైలిపై వచ్చిన విమర్శల నేపథ్యంలో పక్కన పెట్టేసిన ప్రభుత్వం అందుకు భిన్నంగా మళ్లీ తీసుకురావటం హాట్ టాపిక్ గా మారింది.
ఆరు నెలల వ్యవధిలో ఎవరి చేత అయితే ఢిల్లీకి పంపారో.. ఇప్పుడు అదే అధినేత చేతల మీదుగా రాష్ట్రానికి వస్తున్న వైనం ఏపీ ఐఏఎస్ అధికారుల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.