Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేలే దోషులా.. జ‌గ‌న్ త‌ప్పులు లేవా? నేత‌ల టాక్‌

By:  Tupaki Desk   |   20 July 2022 11:30 AM GMT
ఎమ్మెల్యేలే దోషులా.. జ‌గ‌న్ త‌ప్పులు లేవా?  నేత‌ల టాక్‌
X
''అంతా మీదే త‌ప్పు!'' అని పైకి అన‌క‌పోయినా.. మీలో చాలా మంది గ్రాఫ్ బాగోలేదు.. అని మొహం మీదే.. వైసీపీ ఎమ్మెల్యేల కు సీఎం జ‌గ‌న్ చెప్పేశారు. అంతేకాదు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌నీసం 70 మందికి టికెట్లు క‌ష్ట‌మేన‌ని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. స‌రే! ఆయ‌న చెప్పింద‌నే నిజ‌మ‌ని అనుకున్నా.. నిజానికి ఎమ్మెల్యేలు మాత్ర‌మే దోషులా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిపోవాల‌ని.. ఏ ఎమ్మెల్యే అయినా.. అనుకుంటారా? అనేది ఇప్పుడు వైసీపీలోనే జ‌రుగుతున్న కీల‌క చ‌ర్చ‌. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. అయితే.. ఖ‌ర్చులు మాత్రం ఎమ్మెల్యేలే భ‌రించారు.

ఉదాహ‌ర‌ణ‌కు.. ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న ఉషాశ్రీ చ‌ర‌ణ్‌.. గ‌త ఎన్నిక‌ల్లో కోటి రూపాయ‌లు అప్పు తీసుకున్నార‌ని.. ఇప్ప‌టికీ 50 ల‌క్ష‌లు తిరిగి ఇవ్వ‌లేద‌ని.. పార్టీ కే చెందిన ఫైనాన్స‌ర్ ఒకరు ఇటీవ‌ల తాడేప‌ల్లి వ‌ర‌కు ఫిర్యాదు చేశారు.మ‌రోవైపు గుంటూరు కుచెందిన ఓ మ‌హిళా ఎమ్మెల్యే గ‌త ఎన్నిక‌ల్లో త‌న ద‌గ్గ‌ర 50 ల‌క్ష‌లు అప్పు తీసుకుని.. ఇప్ప‌టికీ.. 40 ల‌క్ష‌లు పెండింగులో పెట్టార‌ని.. ఒక బాధితుడు.. పార్టీకి చెందిన నాయ‌కుడు.. రోడ్డుపైనే ఆమె నిల‌దీశారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది.. నాయ‌కులు గ‌త ఎన్నిక‌ల్లో అప్పులు చేసి.. ఖ‌ర్చు చేశారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వారు సంపాయించుకున్నా.. లేక‌పోయినా.. క‌నీసం అప్పులైనా తీర్చుకోవాల‌ని.. భావిస్తారు క‌దా.. కానీ.. ఇప్ప‌టికి మూడేళ్లు అయిపోయినా.. చాలా మంది వ‌ద్ద నిధులు లేవ‌నేది వాస్త‌వం.ఈ విష‌యం..నియోజ‌క‌వ‌ర్గా ల్లోనే వినిపిస్తోంది.

అంతెందుకు.. ఇటీవ‌ల గుంటూరులో ప్లీన‌రీ నిర్వ‌హించారు. దీంతో ఇదే జిల్లాకు చెందిన మంత్రి ఒక‌రు.. సుమారు 50 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి వ‌చ్చింద‌ట‌. దీంతో ఆ మంత్రి.. ఎవ‌రిని అడిగినా..లేవ‌నేస‌రికి..ఏకంగా..ఇంటిని తాక‌ట్టు పెట్టి..20 ల‌క్ష‌లు తెచ్చి..ఇంత‌క‌న్నా ఇవ్వ‌లేమ‌ని.. చేతులు ఎత్తేశార‌ట‌. ఈ విష‌యంలో వైసీపీలో కొన్నాళ్లుగా న‌లుగుతూనే ఉంది.

మ‌రి దీనిని బ‌ట్టి.. తామే ఇబ్బందుల్లో ఉంటే.. ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాల‌నేది నేత‌ల మాట‌. కానీ, నేత‌ల మాట‌ల‌ను మాత్రం జ‌గ‌న్ వినిపించుకోవ‌డంలేదు. వారికి చేతిలో రూపాయి ఇవ్వ‌డం లేదు. అంతా సెంట్రిక్‌గా త‌నే చేస్తున్నారు. దీంతో త‌న పేరు మార్మోగుతుంద‌ని.. ఆయ‌న అనుకున్నారు.

అయితే.. ఆయ‌న చేస్తున్న అప్పులు.. రాష్ట్రంలో అభివృద్ధి లేక పోవ‌డం.. వంటివాటిని ప‌రిశీలిస్తున్న ప్ర‌జ‌లు .. జ‌గ‌న్‌పాల‌న‌పై ఒకింత వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. ఈ విష‌యం తెలిసే స‌రికి.. ఇప్పుడు భారం అంతా త‌మ‌పైనే మోపేయడం.. స‌మంజ‌స‌మా..? అనేది నేత‌ల మాట‌. ఇప్పుడు ఇదే విష‌యంపై వైసీపీ వ‌ర్గాలు త‌ల్లడిల్లుతున్నాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.