Begin typing your search above and press return to search.

అసాధ్యం.. సుసాధ్య‌మైంది.. మ‌రెవ‌రూ సృష్టించ‌లేని.. జ‌గ‌న్ బిగ్ బ్రేక్‌!!

By:  Tupaki Desk   |   19 Dec 2020 5:30 PM GMT
అసాధ్యం.. సుసాధ్య‌మైంది.. మ‌రెవ‌రూ సృష్టించ‌లేని.. జ‌గ‌న్ బిగ్ బ్రేక్‌!!
X
తాను అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో ఓ శ‌త‌ఘ్నిలా దూసుకుపోతున్న వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఈ నెల 25న ప్రారంభించ‌నున్న కీల‌క‌మైన ప‌థ‌కం.. బ‌హుశ ఈ రాష్ట్రంలోనే కాదు.. ఏకంగా దేశంలోనే మ‌రెవ‌రూ.. ఇంత‌కు ముందు.. ఇక‌పై కూడా చేసే అవ‌కాశం లేద‌ని అంటున్నారు మేధావులు. ఈ చ‌రిత్ర ఇక్క‌డే.. ఇప్పుడే.. పుట్ట‌డంతోపా టు.. ఇక్క‌డితోనే ఫుల్ స్టాప్ ప‌డుతుంద‌ని.. ఇది జ‌గ‌న్‌కు మాత్ర‌మే సాధ్య‌మైంద‌ని.. కొనియాడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాల‌ను ఇచ్చే కార్య‌క్ర‌మానికి జ‌గ‌న్ ఈ నెల 25న శ్రీకారం చుడుతున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే నాలుగు సార్లు వాయిదా ప‌డిన ఈ కార్య‌క్ర‌మం ఇప్పుటికి శ్రీకారం చుట్టుకుంది.

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఇదో సంచ‌ల‌న నిర్ణ‌యం. వ్య‌క్తిగ‌తంగా ఇండిపెండెంట్ హౌస్ పేద‌ల‌కు ఇవ్వ‌డం అనేది దేశంలో ఎక్క‌డా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ చేయ‌డం లేదు. దీనికి కార‌ణం.. భూమి కొర‌త‌. ఇప్ప‌టికే పారిశ్రామిక వాడ‌లు పెరిగిపోవ‌డం, పైగా కొత్త‌గా వ‌చ్చే ప‌రిశ్ర‌మ‌ల‌కు భూములు కేటాయించాల్సిన అవ‌స‌రం, కేంద్రం ఏర్పాటు చేసే ప్రాజెక్టుల‌కు కూడా అవ‌స‌ర‌మైతే.. భూములు ఇవ్వాల్సిన ప‌రిస్థితి రాష్ట్రాలకు ఉన్న నేప‌థ్యంలో పేద‌ల‌కు ఇండిపెండెంట్ హౌస్ అనే ఆలోచ‌న‌ను ఎవ‌రూ చేయ‌డం లేదు. అలాంటి స‌మ‌యంలో గత ఎన్నిక‌ల్లో పాతిక ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాలు ఇవ్వ‌డంతోపాటు.. వాటిని క‌ట్టించి ఇస్తామ‌ని కూడా జ‌గ‌న్ త‌న మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అప్ప‌ట్లో దీనిని అప‌హాస్యం చేశారు చాలా మంది.

ఎందుకంటే.. రాష్ట్రంలో భూముల కొర‌త‌, పైగా అట‌వీ భూముల‌ను తీసుకున్నా.. వీటికి అనుమ‌తులు రావ‌డం ఏళ్ల త‌ర‌బ‌డి ప‌డు తుంది. వ‌చ్చినా.. వాటికి చెల్లించే సొమ్ములు, అక్క‌డ మౌలిక స‌దుపాయాల ఏర్పాటు.. అబ్బో ఇదంతా పెద్ద భారం అనుకున్నా రు. దీనినే ఎన్నిక‌ల స‌మ‌యంలో కొన్ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌చారం కూడా చేశాయి. కానీ, జ‌గ‌న్ త‌ను ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డ్డారు. ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉన్న భూముల‌తో పాటు.. దాదాపు 20 వేల ఎక‌రాల‌ను ప్రైవేటు వ్య‌క్తుల నుంచి మార్కెట్ రేటుకు కొనుగోలు చేసింది. అదేస‌మ‌యంలో మౌలిక స‌దుపాయాల ఏర్పాటును కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అయితే.. ఇక్క‌డే కొన్ని కేసులు కోర్టుల‌కు వెళ్ల‌డంతో నాలుగు వేల ఎక‌రాల్లో పంపిణీకి ఉద్దేశించిన పేద‌ల ఇళ్ల‌పై సందిగ్థ‌త ఏర్ప‌డింది.

దీంతో ప‌లు ద‌ఫాలుగా వాయిదా ప‌డుతూ.. వ‌చ్చిన ఈ కార్య‌క్ర‌మానికి ఎట్ట‌కేల‌కు ముహూర్తం ఫిక్స‌యింది. సుమారు 30 ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాల‌ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పుడు కేవ‌లం స్థ‌లాల‌ను మాత్ర‌మే ఇచ్చినా.. త్వ‌ర‌లోనే ఇళ్ల‌ను కూడా క‌ట్టించి ఇవ్వ‌నున్నారు. ప్ర‌త్యేకంగా కాల‌నీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. బ‌హుశ దేశ చ‌రిత్ర‌లో ఇదో సువ‌ర్ణాధ్యాయం అని చెప్పాల్సిందే! ఎందుకంటే.. ఇక‌ముందు ఎవ‌రు అధికారంలోకి వ‌చ్చినా.. ఇంత భారీ స్థాయిలో భూ సేక‌ర‌ణ‌, పంపిణీ.. వ్య‌క్తిగ‌త ఇళ్ల పంపిణీ వంటివి చేప‌ట్టే అవ‌కాశం లేదు. పైగా ఈ ఇళ్ల ల‌బ్ధిదారుల వివ‌రాల‌ను ఆన్‌లైన్ చేయ‌డంతోపాటు.. ఆధార్‌కు కూడా లింకు చేస్తున్నారు. భూముల రీస‌ర్వేలోనూ వీరి పేర్ల‌ను చేర్చ‌నున్నారు.

మొత్తంగా రాష్ట్రంలో ఇల్లు లేని పేద‌లు ఉండే ఛాన్స్ లేకుండా చేస్తున్న ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. పేద‌ల‌కు మ‌హ‌త్త‌ర‌మైన మేలు జ‌రుగుతోందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే.. ``తానే సృష్టించిన చ‌రిత్ర‌కు.. తానే ముగింపు కూడా కానున్నారు జ‌గ‌న్‌!!`` అని మేధావి వ‌ర్గం పేర్కొన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఎందుకంటే.. పేద‌ల‌కు ఇంత విస్తృత నిక‌ర ల‌బ్ధి క‌లిగించే మ‌రో ప‌థ‌కం రాదు.. వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డ‌మూ లేదు.!!